కొత్త అధ్యయనం.. ఫోన్ ఎక్కువగా వాడేవారిలో.. ఈ సమస్య కూడా వస్తుందా?
అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్న అరచేతిలో మాత్రం మొబైల్ ఉండాల్సిందే. ఒక్క క్షణం పాటు చేతిలో మొబైల్ లేకపోయినా ఏదో కోల్పోయినట్లుగా మనిషి ఫీల్ అయిపోతున్నాడు. అంతలా ఇక మొబైల్ కి బాగా అలవాటు పడిపోయాడు అని చెప్పాలి. అయితే చివరికి బాత్రూం కి వెళ్తున్న కూడా మొబైల్ పట్టుకొని వెళుతూ ఉన్న మనుషులను కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయితే మొబైల్ లో అన్ని పనులను పూర్తి చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ అతిగా మొబైల్ వాడటం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.
అతిగా మొబైల్ వాడకం ఇక మనిషిలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే విషయంపై అధ్యయనాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఫోను అతిగా వాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో తేలింది. యూరోపియన్ హార్ట్ జర్నల్ డిజిటల్ హెల్త్ లో పబ్లిష్ అయిన నివేదిక ప్రకారం రోజుకు 6 గంటల కంటే ఎక్కువ ఫోన్ వాడే వారిలో హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం 25 శాతానికి పైగా ఉంటుందట. దీని కారణంగా గుండే కిడ్నీ సమస్యలు వచ్చే రిస్క్ కూడా అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.