ఓరి నాయనో.. రోజుకు ఒక్క అరటిపండు తింటే.. ఇన్ని లాభాలా?

praveen
నేటి ఆధునిక సమాజంలో మనిషి జీవనశైలిలో ఎంతలా మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజువారి అలవాట్ల దగ్గర నుంచి చేసే ఉద్యోగం వరకు ప్రతి విషయంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలాంటి మార్పులు  ప్రతి మనిషి ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునేవారు అందరూ. ఆరోగ్యం బాగుంటే అంతకంటే పెద్ద ఆస్తి ఇంకేమీ ఉండదు అని భావించేవారు.

 కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేశారు అందరూ. ఈ క్రమంలోనే మనీ సంపాదించాలి అనే వేటలో చివరికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా ఎంతోమంది అనారోగ్య సమస్యలు బారిన పడడానికి కారణం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏకంగా మనకు అందుబాటులో ఉండే కొన్ని రకాల పండ్లను క్రమం తప్పకుండా తినడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పండ్లలో అరటిపండు కూడా ఒకటి.

 రోజుకి ఒక అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సూపర్ఫూట్ గా పిలిచే అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచి శరీరానికి కావాల్సిన శక్తి అందేలా చేస్తుంది. అంతే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా అరటిపండు తోడుపడుతుందట. గుండెకు మేలు చేస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకలను బలోపేతం చేయడంతో పాటు షుగర్ లెవెల్స్ ని తగ్గించడం కారణంగా డయాబెటిస్ రోగులకు కూడా ఇది ఎంతగానో సహాయపడుతుందట. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంతోపాటు.. ఇక డీహైడ్రేషన్ భారి నుంచి కూడా అరటిపండు కాపాడుతుందట. అందుకే ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా ఇలా అరటిపండును తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: