థైరాయిడ్ పేషెంట్లకు అలెర్ట్.. తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే

frame థైరాయిడ్ పేషెంట్లకు అలెర్ట్.. తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే

Suma Kallamadi
ఈ రోజుల్లో థైరాయిడ్ అనేది చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో థైరాయిడ్ పేషెంట్లు తప్పుకుండా తినాల్సిన ఫుడ్ ఒకటి ఉంది. అవే గుమ్మడి గింజలు. ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే అజీర్ణం వంటి సమస్యలను తరిమికొడుతుంది. గుమ్మడి గింజలు ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చూస్తాయి. ఈ గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉండటం వల్ల థైరాయిడ్‌ను తరిమికొట్టే హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది. సాధారణంగా ఈ థైరాయిడ్ అనేది మెడ ముందుభాగంలో ఉండే ఒక గ్రంథి మాత్రమే. ఇది బాడీలోని ప్రక్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది కనుక సరిగ్గా పనిచేయకపోతే మన శరీరంలోకి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
థైరాయిడ్‌ను తరిమికొట్టాలనుకునేవారు కచ్చితంగా గుమ్మడి గింజలను తింటే చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, పొటాషియం అధికంగా లభిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ గుమ్మడి గింజలు దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. గుమ్మడి గింజల్లో ప్రోటీన్లు, ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా లభించడం వల్ల ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ ఎంతో అవసరం ఉంటుంది. గుమ్మడి గింజల్లో ఈ అయోడిన్‌ను కంట్రోల్ చేసే శక్తి దాగి ఉంది. ఇవేకాకుండా గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
ప్రోస్టేట్ సమస్యలతో బాధపడే మగవారు కచ్చితంగా గుమ్మడి గింజల్ని తీసుకోవాలి. బీపీని కంట్రోల్‌లో ఉంచే శక్తి గుమ్మడి గింజల్లో అధికంగా ఉంది. అలాగే గుండె జబ్బులు తగ్గించడంలో సాయపడుతుంది. గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో నిద్ర సమస్యలు కూడా ఉండవు. నిద్ర సమస్యలతో బాధపడేవారు రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తింటే తగిన ఫలితం లభిస్తుంది. గుమ్మడి గింజల వల్ల థైరాయిడ్ సమస్య తగ్గడం మాత్రమే కాకుండా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. అందుకే వైద్యులు గుమ్మడి గింజల్ని తినమని సలహా ఇస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: