ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా.. అయితే జరిగేది ఇదే?
అయితే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రతి మనిషి రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ చర్మం యవ్వనంగా ఉంటుందని.. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతూ ఉంటారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా పరగడుపున లేవగానే నీళ్లు తాగాలి అని సూచిస్తూ ఉంటారు. అయితే డాక్టర్లు చెప్పారు కదా అని ఎంతో మంది ఇలా ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి పాటించడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
ఇలా ఉదయం లేవగానే నీళ్లు తాగితే ఎలాంటి లాభాలు ఉన్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీర జీవక్రియ రేటు సాధారణం కంటే 30% పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలు ఆరోగ్యంగా మారతాయని.. అలాగే శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అంటూ సూచిస్తున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇక బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది అంటూ చెబుతున్నారు. అందుకే ప్రతి మనిషి రోజుకి నాలుగు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి అంటూ సూచిస్తున్నారు.