వామ్మో.. ఇదెక్కడి వైరస్ బాసూ.. పురుషుల మగతనానికే సవాల్?

praveen
ఇటీవలే కాలంలో మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేసేందుకు ఎన్నో రకాల వైరస్లు ముంచుకొస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అటు మనుషులు ఎంత అతి జాగ్రత్తలు తీసుకున్న కొన్ని వైరస్లు మాత్రం మనుషులపై పంజా విసురుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వైరస్ల గురించి కొన్ని విషయాలు తెరమీదకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. అయితే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ గురించి తరచుగా మనం వింటూ ఉంటాం. స్త్రీలలో ఇది గర్భాశయ క్యాన్సర్ కూ కారణం అవుతూ ఉంటుంది.

 అయితే ఇటీవల ఈ వైరస్ గురించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కారణంగా ఏకంగా పురుషుల్లో కూడా లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుందట. దీంతో సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుందని ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో వెళ్లడైంది. హెచ్ పి వి తో లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయట. ఈ ఇన్ఫెక్షన్లు రెండు రకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. వాటిలో ఒకటి అధిక ప్రమాదకరమైనది. కాగా మరొకటి మాత్రం తక్కువ ప్రమాదం కలిగిన ఇన్ఫెక్షనట. హైరిస్క్ ఇన్ఫెక్షన్ సోకిన పురుషులలో లైంగిక సమస్యలు తలెత్తుతాయట.

 అర్జెంటినాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కార్దోబా పరిశోధకుడు 205 మంది యువ పురుషుల వీర్యం క్వాలిటీని పరిశీలించారు. వారిలో 39 మందికి హెచ్పీవీ పాజిటివ్ గా ఉంది. వారిలో 20 మంది హై రిస్క్ ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నట్లు తేలింది. ఇక ఏడుగురు తక్కువ రిస్క్ ఇన్ఫెక్షన్తో ఉన్నారట. 12 మంది మధ్యతరగతి కలిగి ఉన్నారట. అయితే వీరందరి వీర్యాన్ని సేకరించి పరిశోధించగా.. హైరిస్క్ ఇన్ఫెక్షన్ సోకిన పురుషుల నుంచి తీసుకున్న శాంపిల్స్ లో రోగ నిరోధక కణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఇక ఎక్కువ వీర్య కణాల బాహ్య కవచం చీలిపోయి వీర్య కణాలు చనిపోతున్నాయని పరిశోధనలు గుర్తించారు. ఇక ఈ వైరస్ గురించి తెలిసి అందరూ షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: