మొబైల్ ఫోన్ వాడే పిల్లల్లో.. కనిపించే సమస్య ఇదేనట.. మీరు గమనించారా?

frame మొబైల్ ఫోన్ వాడే పిల్లల్లో.. కనిపించే సమస్య ఇదేనట.. మీరు గమనించారా?

praveen

ఇంట్లో పిల్లలు తమ మొబైల్ ఫోన్‌లకు చాలా సమయం వెచ్చిస్తూ, చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తుంటారు. ఇది చాలా సాధారణమైన సమస్య. పిల్లలు నిద్ర లేచినప్పటి నుంచి భోజనం చేసేటప్పుడు, నిద్రపోయే వరకు మొబైల్ ఫోన్‌లు చేతిలో ఉంచుకుంటారు. వాళ్లను ఫోన్‌ల నుంచి దూరంగా ఉండమని చెప్పడం తల్లిదండ్రులకు చాలా కష్టం. ఇలా నిరంతరం ఫోన్లు వాడటం వల్ల పిల్లలు భోజనం చేయడం, చదవడం వంటి ఇతర పనులపై ఆసక్తి కోల్పోతారు. ఫోన్లను ఎక్కువ సేపు వాడటం వల్ల కళ్లు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుసు. అయితే, పిల్లలు మొబైల్ ఫోన్‌లను అధికంగా వాడితే వారికి ఇంకే ఇబ్బందులు వస్తాయి? ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
• మెంటల్ హెల్త్ డ్యామేజ్  
పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు వాడితే ఆటలు ఆడుతూ, వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు రంగురంగుల చిత్రాలు చూస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్లకు నిజ జీవితం చాలా నెమ్మదిగా, ఆసక్తి లేనిదిగా అనిపించవచ్చు. దీంతో వాళ్లు ఫోన్లు వాడడం తప్ప ఇంకేమీ చేయాలని అనుకోరు. పుస్తకాలు చదవడం వాళ్లకు బోరుగా అనిపించవచ్చు. ఇది వాళ్ల మనసు మీద చాలా చెడు ప్రభావం చూపుతుంది.
స్పీచ్ డే
అప్పుడప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్న చిన్న పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వాళ్లకు మాటలు అంత ఫ్లోగా రావు. ఎందుకంటే, వాళ్లు ఫోన్‌లపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇంట్లో జరిగే సంభాషణల మీద శ్రద్ధ పెట్టరు. దీంతో వాళ్లు మాట్లాడటం నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
హార్మోనల్ చేంజెస్
పిల్లలకు మొబైల్ ఫోన్‌లు ఇవ్వడం వల్ల వాళ్లు కొంత సేపు సంతోషంగా ఉంటారు. ఫోన్‌లలో వాళ్లకు ఇష్టమైన కార్టూన్‌లు చూస్తే వాళ్ల శరీరంలో డోపమిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీంతో వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే, ఫోన్‌లు లేకపోతే వాళ్లకు డోపమిన్ విడుదల కాదు. దీంతో వాళ్లు సంతోషంగా ఉండడం కష్టం. ఇది వాళ్లకు చదవడం, ఆడడం, నేర్చుకోవడం వంటి పనులపై ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది.
అయిస్ ప్రాబ్లమ్స్‌
కోవిడ్-19 తర్వాత పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్‌ల ముందు ఉంటున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, వాట్సాప్ గ్రూపులు దీనికి కొన్ని కారణాలు. ఎక్కువ సేపు ఫోన్‌లు వాడటం వల్ల పిల్లలకు కళ్లు దెబ్బతింటాయి. దీంతో వాళ్లకు శాశ్వతంగా కళ్ళు పాడవ్వొచ్చు. కోవిడ్ తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా మారాయని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి ఎక్కువగా పడితే కార్నియా సమస్యలు వస్తాయి. దీంతో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: