మగవారిలో దారుణంగా క్షీణిస్తున్న సంతాన సామర్థ్యం.. షాకింగ్ రిపోర్ట్?
ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పురుషుల్లో కనిపించే ఇన్‌ఫెర్టిలిటీ సమస్యల్లో 45% మందికి వీర్యం తక్కువగా ఉండటం (ఆలిగోస్పెర్మియా) లేదా వీర్యం లేకపోవడం (అజూస్పెర్మియా) వంటి సమస్యలు ఉన్నాయి. ఇరవై సంవత్సరాల క్రితం, పురుషుల్లో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలకు ప్రధాన కారణాలు వరికోసెల్, ఇన్ఫెక్షన్లు లేదా హార్మోన్ల సమస్యలు వంటివి. ఇవి సాధారణంగా చికిత్స చేయడం ద్వారా సరిచేయవచ్చు. కానీ ఇప్పుడు, సరిచేయలేని జన్యుసంబంధమైన, తెలియని కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణాలు జీవనశైలి, పర్యావరణ మార్పులు, ఒత్తిడి, పిల్లలను కనడానికి ఆలస్యం చేయడం వంటివి.
చెన్నైలోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీలో నిపుణులు అయిన డాక్టర్ సంజయ్ ప్రకాష్ జీ మాట్లాడుతూ అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధిక బరువు ఉండటం, మద్యం తాగడం, సిగరెట్లు వెలిగించడం, మత్తు పదార్థాలు వాడడం ల్యాప్‌టాప్ లేదా ఫోన్‌ను మోకాళ్ల మీద పెట్టుకొని ఎక్కువ సేపు ఉండటం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వంటివన్నీ పురుషులు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్, పురుగుమందులు వంటి వాటిలో ఉండే రసాయనాలు, కాలుష్యం వల్ల పురుషుల్లో వీర్యం తగ్గడం, దాని నాణ్యత తగ్గడం జరుగుతుంది. గాలి కాలుష్యం, భారీ లోహాలు వీర్యంలోని DNAని దెబ్బతీస్తాయి. వయసు పెరగడంతో పిల్లల్లో జన్యు సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ. కొంతమంది పురుషుల్లో సమస్యలు పుట్టకతోనే వస్తాయి. క్లైన్‌ఫెల్టర్ సిండ్రోమ్, వై క్రోమోసోమ్ మైక్రోడిలీషన్ వంటి సమస్యలు ఇందులో ఉంటాయి. ఇంకా 700 కొత్త జన్యువులు అజూస్పెర్మియా అనే సమస్యకు కారణమని తేలింది. హెల్తి ఫుడ్స్ తినడం వ్యాయామం చేయడం చెడు అలవాటుకు దూరంగా ఉండటం ద్వారా సంతానలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.