లెమన్ ఆయిల్ తలకు రాస్తే ఈ అద్భుతమైన ప్రయోజనాలు..?

frame లెమన్ ఆయిల్ తలకు రాస్తే ఈ అద్భుతమైన ప్రయోజనాలు..?

Suma Kallamadi
నిమ్మ నూనె లేదా లెమన్ ఆయిల్ అనేది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో చాలా రకాల మంచి గుణాలు ఉన్నాయి. ఇది జుట్టులో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని చంపుతుంది. అంతేకాకుండా, స్కాల్ప్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఈ నూనెలో విటమిన్లు కూడా ఉంటాయి. వీటితో జుట్టుకు మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. నిమ్మ నూనెను వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఇంట్లోనే సులభంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. వివిధ రకాల హెయిర్ మాస్క్‌లలో కూడా దీన్ని కలుపుకోవచ్చు. లెమన్ ఆయిల్ ఎక్కువగా వాడితే జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న ఈ ఆయిల్ హెయిర్ కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. చర్మం, జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మ తొక్కల నుంచి తీసిన తైలం కాబట్టి, ఇది చాలా సహజమైనది. డైలీ హెయిర్ కు దీనిని అప్లై చేసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడొచ్చు. తల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. రోజ్‌మేరీ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో కలిపి వాడితే మరింత మంచి ఫలితాలు లభిస్తాయి. నిమ్మ నూనె ముఖం మీద ఉండే మొటిమలను తగ్గిస్తుంది. చర్మం మీద బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. టీ ట్రీ ఆయిల్‌తో కలిపి వాడితే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే కూడా లెమన్ ఆయిల్ వాడవచ్చు. ఇది జుట్టులోని బ్యాక్టీరియాను చంపి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతోపాటు క్యాస్టర్ ఆయిల్ కూడా వాడవచ్చు. ఆముదం నూనె జుట్టుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు బలంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆముదం నూనె, ఆలివ్ ఆయిల్, లెమన్ ఆయిల్ మూడు కలిపి జుట్టుకు రాసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే దీనిని ట్రై చేసే ముందు డెర్మటాలజిస్టుల సలహా తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: