సింగిల్ మాల్ట్ విస్కీ గురించి మీకు తెలుసా..?
సింగిల్ మాల్ట్ విస్కీ అనేది ఇది ఒక రకమైన విస్కీ. దీన్ని తయారు చేయడానికి ఒకే ఒక్క డిస్టిలరీ ఉపయోగిస్తారు. ఈ విస్కీని తయారు చేయడానికి ఒక రకమైన గింజను (సాధారణంగా బార్లీ అనే గింజను) ఉపయోగిస్తారు. సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఇతర దేశాల్లో తయారు చేసే సింగిల్ మాల్ట్ విస్కీలన్నీ దీన్నే ఆదర్శంగా తీసుకునే తయారు చేస్తారు.
ఐర్లాండ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, అనేక ఇతర దేశాలు అద్భుతమైన టేస్ట్‌తో సింగిల్ మాల్ట్ విస్కీ తయారు చేస్తాయి. రీసెంట్ ఇయర్స్‌లో ఇండియాలో కూడా సింగిల్ మాల్ట్ విస్కీ ప్రొడక్షన్ భారీ రేంజ్ లో పెరిగింది. ఈ రకం విస్కీలను ఇండియా అని వేరే దేశాలకు పెద్ద ఎత్తున ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తోంది. ఇండియా, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సింగపూర్‌లలో స్కాచ్, విస్కీలను మందు బాబులు ఎక్కువ ఇష్టపడుతుంటారు. సింగిల్ మాల్ట్ అలవాటు పడితే దాన్ని తప్ప వేరేది తాగు బుద్ధి కాదు అని అంటారు.
సింగిల్ మాల్ట్, బ్లెండెడ్ విస్కీ మధ్య తేడా తెలుసుకుంటే..
సింగిల్ మాల్ట్ విస్కీని ఒకే ఒక్క డిస్టిలరీలో తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి ఒకే రకమైన గింజను (సాధారణంగా బార్లీ) ఉపయోగిస్తారు. ప్రతి సింగిల్ మాల్ట్ విస్కీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది ఆ పరిశ్రమలో ఉపయోగించే నీరు, గింజలు, తయారీ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్లెండెడ్ విస్కీల కంటే సింగిల్ మాల్ట్ విస్కీలు కొంచెం ధర ఎక్కువే ఉంటాయి. బ్లెండెడ్ విస్కీని వివిధ డిస్టిలరీల్లో తయారు విస్కీలను కలిపి తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి వివిధ రకాల గింజలను ఉపయోగించవచ్చు. బ్లెండెడ్ విస్కీల రుచి సాధారణంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. దీనికి కారణం వివిధ విస్కీలను కలిపి ఒకే రకమైన రుచిని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. సింగిల్ మాల్ట్ విస్కీల కంటే బ్లెండెడ్ విస్కీలు సాధారణంగా తక్కువ ధరలో లభిస్తాయి.