రెడ్ పియర్ పండ్ల వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

frame రెడ్ పియర్ పండ్ల వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

praveen
ప్రతిరోజూ పండ్లను మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పండ్ల వల్ల శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందలోనూ రెడ్ పియర్ పండు వల్ల బోలెడు లాభాలున్నాయి. వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ ఎరుపు పియర్స్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెడ్ పియర్ పండునే పేదవారి ఆపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండును ప్రతిరోజూ మన డైట్‌లో చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెడ్ పియర్ పండు గురించి , దాని లాభాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఎర్రని పియర్ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ పియర్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాగి మూలకాలు రెడ్ పియర్ పండులో బాగా ఉండటం వల్ల అది శరీరానికి అధిక శక్తిని, బలాన్ని అందిస్తుంది. గర్భిణులు తమ ఆహారంలో ఈ రెడ్ పియర్ పండును భాగం చేసుకుంటే అద్భుత ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల అది జన్యుపరమైన వైకల్యాన్ని నివారించి తల్లీబిడ్డా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి రెడ్ పియర్ బాగా సాయపడుతుంది. రెడ్ పియర్ పండులో ఫైబర్, పొటాషియం బాగా ఉండటం వల్ల అది రక్తపోటు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఈ పండు కాపాడుతుంది. రెడ్ పియర్ పండులో ఆంథోసైనిన్ పుష్కలంగా ఉండటం వల్ల టైప్2 డయాబెటిస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. రెడ్ పియర్ పండులో విటమిన్ ఎ, సి, కె అధికంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కణాలకు నష్టం కూడా జరగదు. కాబట్టి ఈ పండును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: