ఖర్జూరాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Purushottham Vinay
ఖర్జూరాల వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక  పదిరోజులపాటు లేదా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతి రోజు నాలుగయిదు తినాలి. డయాబెటిస్‌ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా చాలాబాగుంటాయి. అందుకే  వీటిని ఎక్కువ గా అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో ఉన్న పోషకాలు పుష్కలంగా ఉంటాయి.దీన్ని ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ తరుచు ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి  ఎంతో మంచి జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుఉంటాయో తెలుసుకుందాం..


గుండెకు బలం..ఖర్జూరాలు  తింటే గుండె ఆరోగ్యానికి మేలుచేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, ఇంకా తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్‌టెన్షన్‌ , స్ట్రోక్‌ వంటి సమస్యలు రాకుండా ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో,పోటాషియం పుష్కలంగా ఉంటుంది.ఇది హార్ట్‌బీట్, బీపీని నార్మల్‌ స్టేజ్ లో ఉంచుతుంది.కండరాలు బలంగా, దృడంగా ఉంటాయి.. ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. పోటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్‌ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి  ఎన్నో సమస్య లు ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.సంతానోత్పత్తి సామర్థ్యం..మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి.


ఖర్జూరం తింటే స్పెర్మ్‌ నాణ్యత పెరుగుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తి..ఖర్జూరాల్లో ఉండే విటమిన్‌ 'బి6' వల్ల మెదడు చురుగ్గా, చాలాకీగా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను ప్రతి రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్‌ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్‌ కడుపులో  చెడు బాక్టీరియా ను తొలగించి మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి.పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము,ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల  సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.జీర్ణ సమస్యలు దూరం..ఖర్జూరంలో ఉండే ఫైబర్‌ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం రాకుండా నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: