వానా కాలంలో పెరుగు తింటున్నారా? అయితే ఈ సమస్యలు ఖాయం?

Purushottham Vinay
వానా కాలంలో పెరుగు తింటున్నారా? అయితే ఈ సమస్యలు ఖాయం? 

 వానా కాలంలో అది కూడా రాత్రిపూట పెరుగు ఎక్కువగా తింటే ఖచ్చితంగా సమస్యలు తప్పవు. ఖచ్చితంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రిపూట పెరుగు కాకుండా మజ్జిగ, రైతా రూపంలో తీసుకుంటే మంచిది. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, తాజా పెరుగు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఏ సమయంలోనైనా సరే పెరుగును ఎక్కువగా తినకుండా తగిన మోతాదులో మాత్రమే తింటూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అదేవిధంగా, పెరుగు తిన్న తర్వాత మీకు ఏదైనా అలర్జీ లేదా అసౌకర్యం కలిగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.అయితే మితంగా తింటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


వానా కాలంలో పెరుగును పరిమిత పరిమాణంలో తినడం వల్ల డయేరియాను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముకలు, దంతాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పెరుగును ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. అయితే పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వానా కాలంలో రోజుకు రెండుసార్లు 200 గ్రాముల పెరుగు తింటే మలబద్ధకం సమస్యలు తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, మలబద్ధకం సమస్య తగ్గుతుందని తేలింది.కాబట్టి వానా కాలంలో కేవలం పరిమితంగా మాత్రమే పెరుగు తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: