విక్స్ తో దిమ్మతిరిగే లాభాలు? తెలిస్తే ఆశ్చర్యపోతారు?

Purushottham Vinay

మనకు ఎప్పుడైనా తల నొప్పి, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వచ్చినప్పుడు ఉపశమనం కోసం విక్స్ ని వాడుతూ ఉంటాము. అయితే విక్స్ వీటికే కాదు చాలా సమస్యలకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలిసింది. మరి విక్స్ వల్ల కలిగే ఆ ఉపయోగాలు గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.చర్మంపై దురదలు వస్తుంటే విక్స్ రాయాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా కాటన్ తీసుకుని దానికి విక్స్ రాసి చెవిలో పెట్టుకుంటే చెవి నొప్పి తగ్గిపోతుంది.చాలా మంది యువతకి, పెద్ద వాళ్లకి మొటిమల సమస్య తీరని తీవ్రమైన సమస్యగా ఉంటుంది. దీనికి విక్స్ తో ఈజీగా చెక్ పెట్టవచ్చు.రోజుకు కనీసం 3 సార్లు విక్స్‌ను మొటిమలపై క్రమం తప్పకుండా రాస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. కొద్దిగా విక్స్‌ను తీసుకుని చెవుల వెనుక, మోచేతులపై, మెడపై, మోకాళ్లపై రాసుకుంటే కీటకాలు, పురుగులు, ఈగలు వాలవు. విక్స్ డబ్బాను ఓపెన్ చేసి ఆహార పదార్థాలకు సమీపంలో ఉంచితే అక్కడ ఈగలు వాలవు. గాయం అయిన చోట విక్స్ రాస్తే త్వరగా ఆ గాయం తగ్గిపోతుంది.

శరీరంలో కండరాలు నొప్పులు ఉంటే ఆ ప్రదేశాల్లో విక్స్‌ను రాసి బాగా మర్దనా చేయాలి. ఆ తరువాత టవల్‌తో గట్టిగా వేడి ఉండేలా చుట్టాలి. దీంతో కండరాల నొప్పులు తగ్గిపోతాయి. చర్మం తడి ఆరిపోయి పొడిగా మారి ఇబ్బందులు పెడుతుంటే విక్స్ రాయాలి. దీంతో చర్మం ఎంతో మృదువుగా మారుతుంది.ఇక కొద్దిగా విక్స్‌ను తీసుకుని దానికి కొంత వేజలిన్ కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి లేదంటే బట్టలకు రాసుకుంటే దోమలు కుట్టవు. ఇంకా అలాగే వెల్లుల్లి రెబ్బలపై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వద్ద పెట్టుకుని గట్టిగా శ్వాస పీల్చాలి. దీంతో సైనస్ తలనొప్పి తగ్గిపోతుంది. ఇంకా అలాగే కాలి వేళ్లకు ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వస్తే ఆ ప్రదేశంలో విక్స్ రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే ఇన్‌ఫెక్షన్ పోతుంది. గొంతు లేదా ఛాతిపై కొద్దిగా విక్స్ రాసి మర్దనా చేస్తే ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం సాగిపోయినట్టుగా మార్క్‌లు ఏర్పడితే ఆయా ప్రదేశాల్లో విక్స్ రాయాలి. 2 వారాల పాటు ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: