రోజు వాడే టూత్ బ్రష్ ని.. ఎన్ని రోజులకొకసారి మార్చాలో తెలుసా?
ఇక ప్రతి ఒక్కరు కూడా తమకు ఇష్టమైన బ్రాండ్ కు చెందిన టూత్ బ్రష్ లను ఉపయోగించడం చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఉపయోగిస్తున్న టూత్ బ్రష్ ని ఎంత కాలానికి మారిస్తే మంచిది. ఒకవేళ మార్చకపోతే ఎలాంటి ఎనర్జీలు వస్తాయి అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చడం ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేస్తే నోటి ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందట. అలాగే దంతాల దృఢత్వం కూడా పెరుగుతుంది.
అయితే వంగిన విరిగిన బ్రిసల్స్ తో దంతాలను శుభ్రపరచడం ఏ మాత్రం మంచిది కాదని. ఇది పళ్ళలో బ్యాక్టీరియా తగ్గించడం కాదు పెరిగేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు పళ్ళల్లో పాచి పేరుకొనేలా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా జలుబు ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న సమయంలో కూడా పాత బ్రెష్ వాడకుండా కొత్త బ్రష్ ను ఉపయోగించాలని చెబుతున్నారు. ఒకవేళ అలాగే వాడితే మాత్రం చివరికి మళ్ళీ ఇన్ఫెక్షన్ కి గురయ్యే ప్రమాదం ఉంటుందట.
ఈ మధ్య కాలంలో చాలామంది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కూడా రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి బ్రష్ హెడ్ మారుస్తూ ఉండాలట. ఇక బ్రషింగ్ సమయంలో అధిక వేగవంతంగా కదులుతుంది. కాబట్టి మాన్యువల్ టూత్ బ్రష్ కంటే ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ ముందుగా మారుస్తూ ఉండాలట. అయితే ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం లేదంటే కొత్త దంతాల అమెరికా లాంటి చికిత్స చేయించుకుంటే మాత్రం ఆ సమయంలో అనువైన టూత్ బ్రష్ ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.