డైట్ ఫాలో అవుతున్నారా?.. అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిన 5 ఫ్యాట్స్ ఇవే..!

lakhmi saranya
ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువమంది డైట్ ని ఫాలో అవుతున్నారు. డైట్ ని క్రమం తప్పకుండా ఫాలో అయ్యి తమ హెల్త్ ని కాపాడుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో అనేకమంది కొన్ని ఆహారాలను తీసుకుంటున్నారు. బరువు పెరుగుతామేమో అని భయంతో కొవ్వు పదార్థాలను దూరం పెడుతున్నారు కూడా. అయితే గుండె ఆరోగ్యానికి మరియు మెదడు పనితీరుకు, హార్మోన్ల బ్యాలెన్స్ కు మంచి కొవ్వులు అవసరం అని డాక్టర్లు సూచిస్తున్నారు. కాబట్టి కొన్ని కొవ్వు పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే వీటిని మీ బాడీలో బిల్డ్ చేసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. హెల్తి ఫ్యాట్స్ అందించే ఏకైక ఫ్రూట్స్ లో అవకాడో కూడా ఒకటి. ఇందులో మెలో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
2. కురలకు వాడుకోదగా మంచి నూనెలో ఆలివ్ నూనె ఒకటి. ఇందులో హెల్త్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇవి హెల్తి ఫ్యాట్స్ ను ఆరోగ్యానికి అందిస్తుంది.
3. ఎలాంటి భయం లేకుండా తీసుకోదగా హెల్త్ ప్యాచ్ లో నట్స్ కూడా ఒకటి. రోజుకు కొన్ని బాదం పప్పులు, పిస్తా వంటి వాటిని తీసుకోవడం ద్వారా విటమిన్లు, మినరల్స్ తో పాటు మంచి కొవ్వు పదార్థాలు శరీరానికి అందుతాయి.
4. రుచితో కూడిన హెల్తీ ఫ్యాట్స్ను కలిగి ఉన్న చాపలు ని కూడా డైలీ రొటీన్ లో చేర్చుకోవచ్చు. చేపల్లో మంచి కొవ్వులతో పాటు అనేక పోషకాలు ఉంటాయి.
5. కొబ్బరిలో మంచి కొవ్వులు దాగి ఉంటాయి. ఇది శరీరంలో సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. కొబ్బరిని నేరుగా లేదా పాలు మరియు స్వీట్ల రూపంలో తీసుకోవచ్చు.

పైన చెప్పిన ఐదు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: