తేలు కుట్టిన చోట.. ఉల్లిపాయ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

praveen
సాధారణంగా వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో పాములు లాంటి జీవులు అటు రైతులకు ఎన్నో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎక్కడో కళ్లకు కనిపించకుండా చాటున దాగి ఉన్న పాములు ఇక కాటు వేయడం లాంటివి చేస్తాయి  అయితే కేవలం పాములు మాత్రమే కాదు తేళ్లు కూడా ఇలా దాడి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే పాములు కుడితే విషం ఎంతో ప్రమాదకరమైనది కాబట్టి కేవలం నిమిషాల వ్యవధిలో  చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే తేలు కుట్టినప్పుడు కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం లేకపోయినప్పటికీ దారుణమైన నొప్పితో విలవిలలాడే పరిస్థితి కారణమవుతూ ఉంటుంది.

 అయితే తేలు కుట్టినప్పుడు ఇక ఎంతోమంది విషం విరిగిపోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది కొన్ని పిచ్చి పనులు కూడా చేస్తూ చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటారు. అయితే తేలు కుట్టిన చోట ఉల్లిపాయ పెడితే విషయం విరిగిపోతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీనిలో వాస్తవం ఎంత ఉంది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయను సగానికి కోసి తేలు కుట్టిన వెంటనే.. అది కుట్టిన చోట రాస్తే ఐదు నిమిషాల్లో తేలు విషం మాయమైపోతుందని చాలామంది చెబుతూ ఉంటారు.

 అయితే దీనికి ఎక్కడ శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేకపోవడం గమనార్హం. సాధారణంగానే ఉల్లిపాయలో యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీంతో ఇది తేలుకాటుకి ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు అని నిపుణుల అంచనా. అయితే తేలు కుట్టినప్పుడు విషం ప్రమాదకరం కాకపోయినప్పటికీ వాటిలోనే స్కార్పియన్స్ లాంటి కొన్ని విషపూరితమైన జాతులు కుడితే మాత్రం ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉందట. అంతేకాకుండా అగ్గిపుల్లలకు ఉండే పొడిని కలిపి తేలు కుట్టిన చోటు రాస్తే కూడా విషం పోతుందని మరి కొంతమంది అంటుంటారు. ఇక దీనికి కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు అని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి నాటు పద్ధతులను పాటించకుండా ఏదైనా విష కీటకం కాటుకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది అని నిపుణులు  సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: