ఉప్పు ఎక్కువై.. 18 లక్షల మంది చనిపోయారు?

praveen
పరిమితికి మించి వాడితే మంచి చేసే ఔషధం సైతం విషంగా మారుతుంది అని అంటూ ఉంటారు నిపుణులు. అందుకే ఏదైనా సరే తగిన మోతాదులో వాడాలి తప్ప మంచి చేస్తుంది కదా.. బాగుంది కదా అని అతిగా వాడితే చివరికి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే కేవలం ఔషధాల విషయంలోనే కాదు మనం రోజువారి ఆహారంలో వాడే పదార్థాలు కూడా ఇలా అతిగా వాడితే మనిషికి చివరికి అపాయం కలిగిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇటీవల కాలంలో ఇక ఎంతోమంది ఎప్పుడు రొటీన్ ఒకే రకమైన ఆహారం తీసుకోకుండా.. ఎప్పటికప్పుడు కొత్త రకమైన ఆహారాన్ని తయారు చేసుకుని తినడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఒకవేళ కొత్త వంటకాలు రాకపోతే యూట్యూబ్ లో చూసి మరి నేర్చుకుంటూ ఇలా వంట చేయడంలో కూడా క్రియేటివిటీని చూపిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని రకాల వంటలు చేసినా ఆ వంటకు సరైన రుచి రావాలి అంటే సాల్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక ఉప్పు తగిన మోతాదులో ఉంటే ఆ వంటకం రుచి అమోఘం అంటూ అందరూ పొగిడేస్తూ ఉంటారు. లేదంటే ఈ వంటకం ఇలా ఉంది ఏంటి అని పెదవి విరుస్తూ ఉంటారు అన్న విషయం తెలుస్తుంది.

 అయితే ఉప్పును తగ్గిన మోతాదులో వాడటం మంచిదే. ఇక వంటలకు రుచి కూడా వస్తుంది. కానీ మోతాదుకు మించి ఉప్పు వాడితే మాత్రం చివరికి ఊహించని అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి అని నిపుణులు ఎప్పుడు  హెచ్చరిస్తూ ఉంటారు. అయితే మోతాదుకు మంచి ఉప్పు వాడకంతో రక్త పోటు, గుండె జబ్బులు, అన్నాశయ క్యాన్సర్, ఊబకాయం, మూత్రపిండాల వ్యాధులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపింది. అయితే అధిక ఉప్పు వాడకంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏకంగా 18.9 లక్షల మంది చనిపోతున్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రస్తుతం పెద్దల్లో ఉప్పు వాడకం 10.78 గ్రాములు ఉందని తెలిపింది. అందుకే తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారంతో పాటు ఉప్పుకు బదులు సుగంధ ద్రవ్యాలు వనమూలికలను వాడాలి అంటూ డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: