జొన్న రొట్టెలు తినడం వల్ల లాభాలు..!!

Divya
మన చుట్టూ పండేటువంటి వాటిలో కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసే తృణధాన్యాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ ధాన్యాల వల్ల మనకు చాలా లాభాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో జొన్నలు కూడ ఒకటి. చాలా మంది వీటితో రొట్టెలు వంటివి చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రహస్తులు కూడా వీటిని తింటూ ఉంటారు. ఈ జొన్నల వల్ల మనం అధిక రక్తపోటు సమస్యలను మలబద్ధకం ఇతరత్తర సమస్యలను కూడా నివారించుకోవచ్చు.

జొన్నలు ఎక్కువగా ఆఫ్రికా వంటి ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. జొన్న పిండితో తయారు చేసిన వంటలను తినడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ మెరుగుపడడం గుండెపోటు రాకుండా ఉండడం బరువు తగ్గడం వంటి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. జొన్నలలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్ వంటివి లభిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఫినాలిక్ సమ్మేళనాలు వంటివి ఈ జొన్నలలో లభిస్తాయి. శరీరంలోని కొండే పేగుల కదలికలను కూడా చురుకుగా చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఫైబర్, గట్ వంటి బ్యాక్టీరియాను అభివృద్ధి చేయడానికి ఈ జొన్నలు సహాయపడతాయి. జొన్నలతో తయారు చేసినటువంటి ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరంలో ఉండే వ్యర్థ కొవ్వు పదార్థాలను నియంత్రించడానికి చాలా సహాయపడతాయి. జొన్న లో ఉండే ఫినాలి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండేటువంటి మంట అధిక ఒత్తిడిని సైతం తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా జొన్న రొట్టెలను తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు ఇందులో ఉండే ఫైబర్ ప్రోటీన్ ల వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. కాబట్టి ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు కూడా వీటిని తినడం మరింత మంచిది. జొన్న రొట్టెలు కాల్చేటప్పుడు కాస్త నువ్వు గింజలు కూడా రొట్టెల మీద చల్లుకొని తినడం వల్ల మరింత టేస్ట్ గా ఉంటాయి. వీటితోపాటు మరిన్ని పోషకాలు కూడా లభిస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: