ఈ టీలు తాగితే జలుబు చిటికెలో మాయం?

frame ఈ టీలు తాగితే జలుబు చిటికెలో మాయం?

Purushottham Vinay
జలుబుతో బాధపడేటప్పుడు శరీరం కూడా వేడిగా అయ్యి జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి సమయంలో యారో టీని తాగడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ముక్కుదిబ్బడ, దగ్గు, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో ఈ టీ అద్భుతంగా పని చేస్తుంది. జలుబుతో బాధపడే వారు లవంగాలతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇన్పెక్షన్ ను తగ్గించడంలో, జలుబు వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే జలుబు చేసినప్పుడు గ్రీన్ టీని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్పెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి.పిప్పర్ మెంట్ టీని తాగడం వల్ల కూడా చక్కటి ప్రయోజనం ఉంటుంది. ఈ టీని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఈ టీని తాగడం వల్ల శరీరానికి కొత్త శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుంది. నిమ్మకాయ మరియు అల్లం టీని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.


నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు అల్లంలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు జలుబును తగ్గించడంలో సహాయపడతాయి. జలుబుతో బాధపడేటప్పుడు యాంటీ వైరల్ లక్షణాలు కలిగిన లైకోరైస్ టీని తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఈ టీ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.జలుబు నుండి చక్కటి ఉపశమనాన్ని కలిగించడంలో చమోమిలే టీ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఒక కప్పు చమోమిలే టీ ని తాగి చక్కగా విశ్రాంతిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి, మంట, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.యాంటీ బయాటిక్ లను వాడకుండా తరుచూ వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో మనం అనేక దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాము. కాబట్టి వీటికి బదులుగా జలుబు నుండి ఉపశమనాన్ని కలిగించే ఈ హెర్బల్ టీలను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తాగడం వల్ల జలుబు నుండి, జలుబు లక్షణాల నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా వీటిని తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: