సిగరెట్, బీడీ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం తెలుసా?

frame సిగరెట్, బీడీ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం తెలుసా?

praveen
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కి కారకం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అంతే కాదు ఎప్పుడూ ఏదో ఒకచోట ఇందుకు సంబంధించిన బోర్డులు కూడా దర్శనమిస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులు అందరి మనసు మార్చేందుకు అటు సిగరెట్, గుట్కా, కైని సహా ఆల్కహాల్ లాంటి అలవాట్ల కారణంగా ఎన్ని అనర్ధాలు జరుగుతాయి అని వాటితో తెలియజేసేందుకు ముఖేష్ లాంటి ప్రకటనలు కూడా చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా దూమపానం మద్యపానం విషయంలో మనిషి తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు.

 మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో అటు స్మోకింగ్ కి మనిషి బాగా బానిసగా మారిపోతు ఉన్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు కేవలం పెద్దవాళ్లు మాత్రమే సిగరెట్ తాగుతూ కనిపించేవారు. కానీ ఇటీవల కాలంలో స్కూలుకు వెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి ఏకంగా పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పొగాకు అలవాటుకు బానిసగా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఎన్నో రకాల బ్రాండ్ సిగరెట్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండడంతో ఎవరికి నచ్చిన సిగరెట్ వారు తాగడం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పటికీ బీడీలు తాగడం చేస్తూ ఉంటాను అని చెప్పాలి. అయితే సిగరెట్ బీడీలు రెండు ప్రమాదకరమే.

 కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం అన్న విషయంపై మాత్రం ఎవరికీ అంత క్లారిటీ ఉండదు. అయితే ఆరోగ్యానికి సిగరెట్ కంటే బీడీ ఎక్కువగా హాని చేస్తుందని ఇటీవల నిపుణులు చెబుతున్నారు. బీడీ కోసం వాడే ఆకులు ఇక దానిని కాల్చినప్పుడు వచ్చే పొగ ఇందుకు కారణమంటూ చెబుతున్నారు నిపుణులు. ఇక ఈ పొగ వల్ల ఊపిరితిత్తులు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందట. సిగరెట్లలో వాడే పొగాకు మోతాదు కంటే.. బీడీల్లో వాడే పొగకు 8% ఎక్కువ ప్రమాదకరమట. తక్కువ ఆదాయం, గ్రామాల్లో ఉండేవాళ్లు.. ఎక్కువగా బీడీలు తాగడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: