ఆరోగ్యానికి రొట్టెలు మంచివా..? అన్నం మంచిదా..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యంపై ఫిట్నెస్ పై అవగాహన ఎక్కువై,అన్నం తింటే ఒళ్ళు పడతామని రొట్టెల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.కానీ శరీర ఆరోగ్యం కేవలం అన్నం పైన,రొట్టెల పైన ఆధారపడి ఉండదు.మన దేశంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితిలో ఉంటాయి.కనుక ఆ వాతావరణం బట్టి ఆహారం తీసుకోవాలి.మన శరీర ఆరోగ్యం కేలరీలను ఖర్చు చేసే విషయంలోనే ఆధారపడి ఉంటుంది.కావున తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడమే చాలా మంచిది.దీనితో చాలామంది వీటిని తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీ లభిస్తాయని అపోహతో రొట్టెలను తీసుకుంటూ ఉంటారు.కానీ కార్బోహైడ్రేట్స్ రొట్టెలలోనూ,అన్నంలోనూ లభిస్తాయి.

రొట్టెలు,అన్నంలలో పోషక విలువలు పెద్దగా తేడా ఉండవు.కావున తొందరగా బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం రోజులో 200గ్రాముల కంటే ఎక్కువ పిండి పదార్థాలను తీసుకోవడం అంత మంచి పద్ధతి కాదు.అయితే మధుమేహం ఉన్నవారు అయితే అన్నానికి బదులు రొట్టెలు తీసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.ఎందుకంటే వీటిలో సంక్షిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి.ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచవు.

బియ్యంలో అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది.దానితో మన జీర్ణవ్యవస్థ దానిని జీర్ణం చేయడానికి చాలా శ్రమ పడాల్సిన అవసరం లేదు.కానీ అన్నంలో రొట్టెల కంటే ఎక్కువ పిండి పదార్థాలు లభిస్తాయి.అందువల్ల అన్నం తీసుకోవడం వల్ల తొందరగా కడుపు నిండుతుంది. అయితే రొట్టెలు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.దీనికి కారణం బియ్యంతో కంపెర్ చేస్తే, రొట్టెలలో పైబర్,భాస్వరం,పొటాషియం వంటి ఖనిజాలు రొట్టెలలో ఎక్కువ ఉంటాయి.

మధుమేహులు అన్నానికి బదులుగా రాగులతో,జొన్నలతో తయారుచేసిన రొట్టెలను తీసుకోవడం వల్ల,అందులో ఉన్న ఫైబర్ తొందరగా జీర్ణమై,గతంలో గ్లూకోస్ లెవెల్స్ ని పెంచకుండా చేస్తుంది. కావున అధిక శ్రమతో పనిచేసే వారికి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉండాలంటే,అన్నాన్ని తినడం మేలు.ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీనివల్ల తొందరగా శక్తి రిలీజ్ అయ్యి వారికి బలం చేకూరస్తుంది.

మరియు అధిక మోతాదులో రొట్టెలు తీసుకోవడం మంచిది కాదు,అన్నం తీసుకోవడం కూడా మంచిది కాదు.కావున సరైన పద్ధతిలో పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: