గోర్లు కొరికే అలవాటు ఉందా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?

praveen
సాధారణం గా ఎంతో మంది అలవాటుగా చేసే చిన్న చిన్న పనులు కొన్ని కొన్ని సార్లు తీవ్రమైన అనారోగ్య సమస్యల కు కూడా కారణమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వాటిలో గోర్లు కొరికే అలవాటు కూడా ఒకటి. ఎంతో మంది టెన్షన్ వచ్చినప్పుడు గోర్లు కొరుకుతూ ఉంటారు. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కూడా ఇలా గోర్లు కొరకడం చేస్తూ ఉంటారు. గోర్లు కొరకడం ఏముంది అదేమైనా పెద్ద అలవాటా.. ఏమైనా ప్రమాదకరం అవుతుందా అని అనుకుంటూ ఉంటారు. కొంత మంది అయితే ఏకం గా వేళ్ళు బయటికి వచ్చేలాగా గోర్లు కొరుకుతూ ఉంటారు.

 తద్వారా ఏకంగా చేతివేళ్ల చుట్టూ కూడా పుండు లాగా తయారవడం జరుగుతుంది. ఇక ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమం లోనే గోర్లను కొరికే అలవాటు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ గోర్లను కత్తిరించుకుంటూ ఉండాలట. ఇక చేదుగా ఉండే నేయిర్ పాలిష్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇక గోర్లు కొరికినప్పుడు చేదు రుచి వస్తుంది. కాబట్టి ఇక అలవాటును మానుకునే అవకాశం ఉంటుంది.

 అదే సమయం లో గోర్లు ఆకర్షణీయం గా కనబడటానికి మానిక్యూర్ చేయించుకోవాలని.. ఎందుకంటే గోర్లు అందం గా కనబడితే వాటిని కొరకాలని అనిపించదు. దీంతో గోర్లు కొరకే అలవాటు తగ్గుతుంది. ఇక ఒత్తిడి లేకుండా యోగ చేయడం వల్ల కూడా గోర్లు కొరికే అలవాటు నుంచి దూరం కావచ్చు. ఇలాంటి పద్ధతులు వలన ఎలాంటి ప్రయోజనం లేకపోతే.. చేతులకు గ్లౌజ్ వేసుకోవాలి. చేతి చివరన బ్యాండేజ్ అంటించుకున్న కూడా ఇలాంటి అలవాటు నుంచి బయట పడొచ్చట. అయితే ఎన్ని చేసిన గోర్లు కొరకే అలవాటు మానుకోక పోతే మాత్రం డాక్టర్ ను సంప్రదిస్తే మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: