కాల్షియం లోపం ఉందని తెలిపే సంకేతాలివే..!!

Divya
మన శరీరం ఆరోగ్యంగా ఉంటే యాక్టివ్గా,హుషారుగా మెదడు పనితీరు మెరుగ్గా ఉండడం వంటి కొన్ని లక్షణాలను చూపిస్తే,అదే అనారోగ్యం ఉన్నట్టు కూడా కొన్ని లక్షణాలను చూపిస్తూ ఉంటుంది.కానీ మనం మాత్రం అవి నెగ్లెట్ చేస్తూ,దీర్ఘకాలిక సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే బాధపడుతూ ఉంటాము.అదే కోవలోకి క్యాల్షియం మన శరీరంలో తక్కువైనప్పుడు కచ్చితంగా మన శరీరం కొన్ని లక్షణాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది.వాటిని తొలిదశలోనే మనం గుర్తించి,తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో దీర్ఘకాలిక సమస్యలు దరి చేరకుండా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అసలు క్యాల్షియం లోపం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..

దంత సమస్యలు..

మనం ఆహారాన్ని తినడానికి ఎంతో అవసరమైన దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే,తగినంత కాల్షియం కావాల్సిందే.ఈ మధ్యకాలంలో చాలామందిలో దంత సమస్యలు మొదలవుతున్నాయి.దీనిని కారణం వారి తినే ఆహారం అనుకుంటారు కానీ,ఒక్కొక్కసారి మన శరీరంలో తగినంత కాల్షియం లేకపోవడం వల్ల దంతాలు దెబ్బతింటు ఉంటాయి.కొంతమందిలో పళ్ళు విరిగిపోవడం,పుచ్చుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే,ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి,క్యాల్షియం డెఫిషియన్సీని  గుర్తించుకోవడం చాలా ఉత్తమం.

ఎముకలు పెలుసు బారడం..

ఎముకలు మొత్తం క్యాల్షియం మీద డిపెండ్ అయి ఉంటాయి కనుక.చాలామంది క్యాల్షియం డెఫిషియన్సీతో కీళ్లనొప్పులు,నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.అంతేకాక ఏ చిన్న దెబ్బ తగిలిన బోన్ విరిగిపోవడం వంటి వాటిని తట్టుకోవాల్సి వస్తుంది.దీనికి కారణం క్యాల్షియం లోపమేనని చెబుతున్నారు వైద్య నిపుణులు.

గోళ్లు పెలుసుగా ఉండడం..

మన చేతి వేళ్లకు మరియు కాళీ వేళ్లకు గోర్లు రక్షణగా ఉంటాయి.అలాంటి కోళ్లు పల్లచగా ఉండడానికి కారణం క్యాల్షియం డెఫిషియన్సీ.అంతేకాక వీరికి గోళ్లు పసుపు రంగులో మారడం,ముట్టుకుంటూనే విరిగిపోవడం, గోర్లలో పుండ్లు వంటి వస్తూ ఉంటాయి.

రుతుక్రమణ సమస్యలు..

స్త్రీలలో అధికంగా రుతుక్రమ సమస్యలు ఏర్పడుతూఉంటాయి.సాధారణంగా నెలనెలా వచ్చే రుతుక్రమణ సమయంలో పొట్టనొప్పి అధికంగా ఉండడం,అధిక బ్లీడింగ్ అవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.దీనికి కారణం కూడా క్యాల్షియం కాల్షియం డెఫిషియన్సీనే.

మెదడు పనితీరు తగ్గడం..

 క్యాల్షియం లోపం వల్ల చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోవడం,,చేసిన పనిని పదేపదే చేయడం,వృద్ధుల్లో అల్జీమర్స్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున మీ శరీరంలో కూడా ఎటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి ఔషధాలు మరియు క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: