క్యాన్సర్ రాకుండా ఉండడానికి డాక్టర్ చెప్పే డైట్ ఏంటో తెలుసా..?
ఫైబర్ డైట్..
వారి డైట్ లో ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల పేగులోని మలినాలన్నీ తొలగించడంలో ఫైబర్ చాలా బాగా పనిచేస్తుంది. మలినాల రూపంలో ఉన్న క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ కూడా బయటికి రావడానికి ఫైబర్ దోహదపడుతుంది.ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు,కూరగాయలను తినడంతో క్యాన్సర్ ని దూరంగా ఉంచుకోవచ్చు.
రైన్బో డైట్..
రైంబోలో ఎన్ని కలర్లు ఉంటాయో అన్ని కలర్లు ఆహారాలు తీసుకోమని డాక్టర్లు చెబుతున్నారు.రైంబో కలర్లో ఉన్న ఫ్రూట్స్,వెజిటేబుల్స్,మీట్ వంటివి రోజులో కనీసం నాలుగైదు రకాలైన తీసుకోవాలని చెబుతున్నారు.దీనితో ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకమైన ప్రిరాడికల్స్ నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
వైట్ సాల్ట్ నిరోధించడం..
మనకు మార్కెట్లో దొరికే సాల్ట్ లో అయోడైజ్డ్ ఉందని రకరకాల బ్రాండ్లు మనకు అంటకడుతూ ఉంటారు.వైట్ సాల్ట్ ని ఎక్కువ ఉపయోగించడం వల్ల,క్రమంగా క్యాన్సర్ కారకమైన కారకాలను తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.దీనికి బదులుగా పింకు సాల్ట్ లేదా రాళ్ల ఉప్పును వాడడం చాలా ఉత్తమట.
జంక్ ఫుడ్ ను వదిలేయడం..
బయట దొరికే జంక్ ఫుడ్ లో వాడే నూనెలు పదేపదే వాడటం వల్ల అందులోని సుగుణాలు పోయి,క్యాన్సర్ కారకాలు పెరిగిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు.వీటికి బదులుగా ట్రెడిషనల్ గా చేసే హెల్తీ స్నాక్స్ తినడం చాలా మంచిదట.
వీటితోపాటు మితంగా తినడం,కంటి నిండా నిద్రపోవడం,అరగంట వ్యాయామం వంటి వాటి వల్ల కూడా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు దూరంగా ఉండవచ్చు.