డైరెక్ట్ స్టవ్ పై కాల్చే ఆహారం తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

frame డైరెక్ట్ స్టవ్ పై కాల్చే ఆహారం తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో చాలా మంది ఫుల్కాలని,శవర్మా,గ్రిల్ చికెన్ అని,గ్రిల్డ్ వెజిటేబుల్స్ అని డైరెక్టర్ స్టవ్ మీద పెట్టి కాల్చే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఆహారానికి రుచి వస్తుందేమో కానీ,శరీరానికి మాత్రం ఎన్నో రోగాలను తెచ్చిపెడుతుంది.టమాటో ఎర్రగడ్డలు,పచ్చిమిరపకాయలు పొయ్యిలో వేసి కాల్చి తినడం పూర్వం కాలం నుంచి వచ్చే పద్ధతే కానీ, ఇది అసలు ఒంటికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.డైరెక్ట్ స్టౌ పై పెట్టి కాల్చడం వల్ల ఆహార నుంచి ఎటువంటి కెమికల్స్ బయటికి వస్తాయో,వాటి వల్ల దుష్ప్రభావాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
ఈ మధ్యకాలంలో చాలామంది పుల్కాలను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు దీనివల్ల వారు బరువు తగ్గుతారని అపోహలో కూడా బతుకూతున్నారు.కానీ వీటిని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి పెట్టడం వల్ల,గ్యాస్ లో ఉన్న బ్యూటెన్ ప్రొఫైన్ మండడం వల్ల కార్బన్డయాక్సైడ్,కార్బన్ మోనాక్సైడ్,మితేన్, బెంజిన్ వంటి గ్యాస్ లను రిలీజ్ చేస్తుంది.ఈ గ్యాస్ స్టవ్ పై డైరెక్ట్ మనం తినే ఆహారాలపై పడటం వల్ల,క్యాన్సర్ కి కారణమైన ప్రిరాడికల్స్ పెరుగుతాయి.
సాధారణంగా ధూమపానం వల్ల వచ్చే క్యాన్సర్ ముప్పు కన్నా ఇలాంటి ఆహారాలను తినడం వల్ల వచ్చే 30 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పరిశోధన చేసి మరీ నిరూపించారు.వీటిని తరుచూ తీసుకోవడం వల్ల రెస్పరేటరీ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మరియు అస్తమాతో బాధపడే వారు వీటిని అస్సలు ముట్టుకోకూడదు.దీనివల్ల ఊపిరితిత్తుల్లోని అనవసరమైన గ్యాస్ ఫామ్ అయి,ఊపిరితిత్తులు మరింత దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు పిల్లల్లో శ్వాస సంబంధమైన సమస్యలు మరింత పెరుగుతాయి.ఇది ఇలాగే కొనసాగితే గుండె పనితీరు దెబ్బతిని,బ్లడ్ ప్యూరిఫికేషన్ ఆగిపోతుంది. దీనితో బ్లడ్ రిలేటెడ్ సమస్యలు తలెత్తుతాయి.
కావున మీరు కూడా ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ఉంటే వెంటనే ఈటికి స్వస్తి చెప్పండి.లేదంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: