అంజీరాలను ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు?

Purushottham Vinay
అంజీరాలను పండ్ల రూపంలో తీసుకున్నా లేదాడ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా మనకు చాలా మేలు కలుగుతుంది. మనకు అంజీరాలు ఏడాది పొడవునా చాలా ఈజీగా లభ్యమవుతాయి. మనం వీటిని ఎంతో కాలంగా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. ఇంకా వివిధ రకాల తీపి వంటకాల తయారీలో కూడా వీటిని వాడుతూ ఉంటారు. ఇతర డ్రై ఫ్రూట్స్ లాగే అంజీరాలను కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి.అంజీరాల్లో విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ ఇంకా కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంజీరాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరుకుండా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారు అంజీరాలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో దోహదపడుతుంది. అంజీరాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా బరువు కూడా తగ్గవచ్చు.



అయితే రుచిగా ఉన్నాయని వీటిని ఎక్కువగా తింటే మనం ఖచ్చితంగా వేగంగా బరువు పెరుగుతాము. ఇక గొంతు ఇన్పెక్షన్ లతో బాధపడే వారు అంజీరాలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అంజీరాలను పేస్ట్ గా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం చాలా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ పేస్ట్ ను వాపులపై రాయడం వల్ల వాపులు ఈజీగా తగ్గుతాయి. అంజీరాలను తీసుకోవడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఇంకా బలంగా తయారవుతాయి. అంతేకాకుండా అంజీరాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రతి రోజూ 2 లేదా 3 అంజీరాలను పాల్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే ఈ అంజీరాలను తిని పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు తగ్గి లైంగిక సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఈ విధంగా అంజీరాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని తప్పకుండా అందరూ ఆహారంగా భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: