నేటి కాలంలో చాలా మంది వేగన్ ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే వేగన్ ఆహారంలో భాగంగా ఆవు పాలు, గేదె పాలకు బదులుగా చాలా మంది పల్లీల నుండి తీసిన పాలను ఆహారంగా తీసుకుంటున్నారు. పల్లీ పాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో కూడా ప్రోటీన్,
విటమిన్ ఇ,
విటమిన్ బి12, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. పల్లీల నుండి తీసిన పాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలతో మనం పెరుగును తయారు చేసుకోవచ్చు.ఇంకా అలాగే ఆవు, గేదె పాలను వాడినట్టు వంటల్లో, తీపి వంటకాల తయారీలో ఇంకా మిల్క్ షేక్ ల తయారీలో పల్లీల పాలను కూడా వాడవచ్చు. అయితే ఆవు పాలు, గేదె పాలు లభించినట్టు పల్లీల పాలు మనకు అంత సులభంగా లభించవు. ఇంకా అలాగే ఈ పాలు అధిక ధరతో కూడుకున్నవి. ఇలా బయట అధిక ధరలకు కొనే బదులుగా ఈ పాలను మనం ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. పల్లీల నుండి పాలను ఎలా తయారు చేసుకోవాలి.. ఆ ఈ పాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీల పాలను తయారు చేసుకోవడానికి ముందుగా పల్లీలను తీసుకుని శుభ్రంగా కడగాలి.ఆ తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పల్లీలను ఒక జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వస్త్రంలో వేసి గట్టిగా మూట కట్టి ఆ పాలను పిండాలి. ఇలా చేయడం వల్ల పల్లీల పాలు సులభంగా తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన పల్లి పాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత మెగ్నీషియం అనేది లభిస్తుంది. ఈ పాలల్లో మనకు దాదాపు 65 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల నీరసం ఇంకా బలహీనత దరి చేరకుండా ఉంటాయి. శరీరానికి తగినంత మంచి
శక్తి లభిస్తుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. లోబీపీ సమస్యతో బాధపడే వారు ఈ పాలను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. పల్లి పాలను తీసుకోవడం వల్ల
గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.