గుండె జబ్బు, BP ఈజీగా తగ్గాలంటే..?

Purushottham Vinay
గుండె జబ్బు, bp ఈజీగా తగ్గాలంటే..?


ఈ రోజుల్లో జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటి వాటిని బీపీ, గుండె జబ్బు బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు.ఇవి చాప కింద నీరులా ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి.ఇక వైద్యులు కూడా వీటిని ప్రమాదకర జబ్బులుగా చెబుతున్నారు.ఒక్కసారి కనుక ఈ వ్యాదుల బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే మందులు వాడడంతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా వీటిని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఈజీగా వీటిని అదుపులో ఉంచుకోవచ్చు.ఇక ఈ సమస్యలతో బాధపడే వారు వారి ఆహారంలో చేపలను చేర్చుకోవాలి. ఇంకా ఈ చేపలల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు పొటాషియం కూడా ఉంటుంది.ఎందుకంటే చేపలను తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.



 పిస్తాపప్పును కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఖచ్చితంగా పొటాషియంతో పాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు, మంచి కొవ్వులు కూడా ఉంటాయి.గుండె జబ్బు,బీపీతో బాధపడే వారు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే ఆకుకూరలల్లో కూడా పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ వారి ఆహారంలో భాగంగా రోజూ ఒక ఆకుకూరను తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే ఈ సమస్యలతో బాధపడే వారు బీట్ రూట్ ఆకులను తీసుకోవడం వల్ల మన కూడా చాలా మేలు కలుగుతుంది. బీట్ రూట్ ఆకులను కాడలతో సహా కట్ చేసి సలాడ్ వంటి వాటిలో వేసి తీసుకోవచ్చు.ఇంకా అలాగే వీటిని షాలో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. ఈ ఆకుల్లో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: