
జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో ఊపిరితిత్తులకు కష్టమే..!
పొల్యూషన్..
ఎటువంటి చెడలవాట్లు లేకపోయినా సరే ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల 100 మందిలో 60 మందికి ఊపిరితిత్తులు చెడిపోతూ ఉన్నాయి.వాతావరణంలో ఉన్న కార్బన్డయాక్సైడ్,కార్బన్ మోనాకసైడ్,నైట్రోజన్ మరియు ఇతర కెమికల్స్ మనం పీలుస్తూ ఉన్నప్పుడు ఊపిరితిత్తులు కచ్చితంగా దెబ్బతింటాయి.కావున ప్రతి ఒక్కరూ పొల్యూషన్ నివారణలో భాగం కావాలి.మరియు బయటికి వెళ్లేటప్పుడు మాస్క్ లేదా స్కార్పు వంటివి ధరించడం చాలా మంచిది.
వ్యాయామం..
ఊపిరితిత్తుల కండరాలను బలోపేతం చేయడానికి రోజూ తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం.ముఖ్యంగా జాగింగ్,స్విమ్మింగ్,సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఊపిరితిత్తులను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతాయి.
పోషకాలు కలిగిన ఆహారం..
యాంటీఆక్సిడెంట్లు,విటమిన్లు మరియు మినరల్స్ పుష్కళంగా ఉన్న ఆహారాలనే ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండాలి.ఈ ఆహార పదార్ధాలన్నీ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.అంతేకాక ఊపిరితిత్తులలో ఎలాంటి వాపు రాకుండా నివారిస్తాయి. రోజువారీ డైట్ లో తాజా పండ్లు,పచ్చి కూరగాయలు, ఆకు కూరలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
పొగకు దూరంగా..
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో ఉన్న పొల్యూషన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.పొగ గొట్టాలు మరియు కర్మాగారాల నుండి వచ్చే పొగలు, ఇతర పొగలకు దగ్గరగా ఉండకూడదు.ప్రతి ఒక్కరూ ఇంటి వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి.
దుమపానం,మధ్యపానం..
ధూమపానం మరియు మద్యపానంకి కచ్చితంగా దూరంగా ఉండాలి.ఈ రెండు అలవాట్ల వల్లనే చాలామంది ఊపిరితిత్తుల సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉన్నారు.ధూమపానం వల్ల వారికి వారు చేసుకునే హానికన్నా,పక్క వారికి కలిగించే హాని ఎక్కువగా ఉంటుంది.కావున ఇటువంటి వారు ధూమపానంకి దూరంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులను పదిలంగా ఉంచుకోవచ్చు.మరియు నీటిని ఎక్కువ తాగడం వల్ల కూడా ఊపిరితిత్తుల డీహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటాయి.