ఈ చిరు ధాన్యాలు తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
మనం తీసుకునే చిరుధాన్యాల్లో వరిగెలు ఒకటి. వీటినే ప్రోసో మిల్లెట్ అని కూడా అంటారు. సజ్జలు, రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాల వలె వరిగెలు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.ఈ వరిగెలను కూడా అన్నంగా వండుకుని తినవచ్చు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.వరిగెలు  అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో, దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా చేయడంలో ఇవి కూడా మనకు చాలా సహాయపడతాయి. ఈ వరిగెలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరిగెలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే త్రిధోషాలన్నీ ఈజీగా తొలగిపోతాయి.మన ఆయుర్వేదంలో కూడా వరిగెలకు మంచి ప్రాధాన్యత ఉంది. ఇంకా అలాగే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇవి చక్కటి ఆహారమని చెప్పవచ్చు.


మన జీర్ణవ్యవస్థకు చక్కటి ఉపశమనాన్ని కలిగించడంలో, అల్సర్, కడుపులో పుండ్లు, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో వరిగెలు మనకు ఎంతో సహాయపడతాయి. ఇక మలబద్దకం సమస్య ఉన్న వారు వరిగెలను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో కదలికలు మెరుగుపడి వారికి సుఖవిరోచనం అవుతుంది.అలాగే వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.ఇంకా దీంతో మన దృష్టి ఇతర ఆహారాలపై పోకుండా ఉంటుంది. అలాగే దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఈ వరిగెలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అంతేకాకుండా షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా వరిగెలు బాగా సహాయపడతాయి. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి కాబట్టి గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు కూడా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఇక ఈ వరిగెల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: