మనం పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరగకుండా ఉంటాయి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం అన్ని రకాల పండ్లను తీసుకోకూడదు.ఎందుకంటే కొన్ని రకాల పండ్లు సహజ సిద్దంగా తియ్యగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పండ్లకు షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. షుగర్ వ్యాధిని మరింతగా పెంచే పండ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ సమస్యతో బాధపడే వారు అరటి పండును అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ అరటిపండులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది. కానీ షుగర్ వ్యాధితో బాధపడేవారు మాత్రం ఈ అరటి పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే ఈ షుగర్ వ్యాధితో బాధపడే వారు అరటిపండును తీసుకోకపోవడమే చాలా మంచిది. ఇంకా అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు మామిడిపండ్లను కూడా తీసుకోకూడదు. ఈ మామిడిపండ్లల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.ఇంకా అలాగే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా పెరుగుతాయి. కాబట్టి మామిడి పండ్లకు కూడా దూరంగా ఉండాలి. ఇంకా అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు పైనాపిల్ ను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఈ పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో చాలా త్వరగా కలిసిపోయి చక్కెర స్థాయిలను ఈజీగా పెంచుతాయి. ఇంకా అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండు ఖర్జూరలను కూడా తక్కువగా తీసుకోవాలి.ఈ ఎండు ఖర్జూరాలలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.కాబట్టి వీటికి కూడా చాలా దూరంగా ఉండాలి.అలాగే పుచ్చకాయను కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు తక్కువగా తీసుకోవాలి.