షుగర్ వ్యాధి బారిన పడడానికి ప్రధాన కారణం మారిన మన ఆహార నియమాలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే మనం తీసుకునే ఆహారాలన్నీ కూడా పాలిష్ పట్టిన ఆహారాలే. అందువల్ల అవి త్వరగా జీర్ణమయ్యి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తాయి.అందుకే చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడాల్సి వస్తుంది.అదే మనం పాలిష్ పట్టని ధాన్యాలను ఇంకా పప్పు దినుసులను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి తగ్గడంతో పాటు లేని వారికి కూడా రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు పాలిష్ పట్టని ధాన్యాలను తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్లప్పుడూ కూడా చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎందుకంటే పాలిష్ పట్టని ధాన్యాల పై పొరల్లో ప్రోటీన్, ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ధాన్యాలను తీసుకున్నప్పుడు వాటిలోని ప్రోటీన్, కొవ్వు పదార్థాల కారణంగా అవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి.అందువల్ల చక్కెరలు నెమ్మదిగా విడుదల అవుతాయి.
ఇంకా అలాగే ఈ ధాన్యాలలో ఉండే ఫైబర్ విడుదలైన చక్కెరను నెమ్మదిగా రక్తంలో కలిసేలా చేస్తుంది.ఇక నెమ్మదిగా రక్తంలో కలిసిన ఈ చక్కెరను మనం మన శరీర అవసరాలకు తగినట్టు ఎప్పటికప్పుడు కూడా వాడేస్తూ ఉంటాము.అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. అదే మనం పాలిష్ పట్టిన ఆహారాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్ ఇంకా కొవ్వు పదార్థాలు అన్ని తొలగిపోతాయి. దీంతో అవి త్వరగా జీర్ణం అయ్యి చక్కెలు వేగంగా రక్తంలో కలుస్తాయి. విడుదలైన ఈ చక్కెరలను మనం వెను వెంటనే ఖర్చు చేయలేము కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల మనం షుగర్ వ్యాధి బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడే వారు లేదా లేని వారికి షుగర్ రాకుండా ఉండాలన్నా మనం పాలిష్ పట్టని ఆహారాలనే తీసుకోవాలని మన ఆహార నియమాలను ముందు నుండే మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.