ఈ డ్రై ఫ్రూట్ తో చక్కని ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి.అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. పిస్తా పప్పు అయితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమంగా ఈ పిస్తా పప్పుని కనుక తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ చాలా ఈజీగా వెన్నలా కరిగిపోతుంది. ఇంకా ఈ పిస్తా పప్పు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిస్తా కళ్లను రక్షిస్తుంది. ఎందుకంటే ఈ పిస్తాలో ఫైబర్, కార్బోహైడ్రేట్, అమైనో యాసిడ్, కొవ్వు కూడా ఉన్నాయి.ఇది నోటి దుర్వాసన, విరేచనాలు ఇంకా దురదలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో సహాయపడుతుంది.పిస్తా పప్పు మన శరీరంలోని కొవ్వును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఆకలిని కూడా పిస్తా పప్పు నియంత్రణలో ఉంచుతుంది.ఇది శరీర బరువును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.  పిస్తా పప్పు ఎక్కువగా తినడం వల్ల రిస్క్ తలనొప్పి, వాపు మరియు శరీరంలో చికాకు ఈజీగా తగ్గుతాయి.


మెదడు పనితీరు, కొలెస్ట్రాల్‌కు పిస్తా చాలా మేలు చేస్తుంది.అలాగే కళ్లు, మెదడు పనితీరు ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి డ్రై ఫ్రూట్ పిస్తా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తా పప్పులో కార్డియోప్రొటెక్టివ్ యాక్టివిటీ ఇంకా న్యూరోప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంటాయి. ఇది నాడీ, గుండెకు చాలా మంచిది.అలాగే మెదడు సంబంధిత సమస్యలను తొలగించి మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ పిస్తా పప్పు సహాయపడుతుంది.రాత్రి వేళ పాలతో పాటు పిస్తా పప్పు తింటే ఖచ్చితంగా మంచి నిద్ర వస్తుంది. అలాగే అధిక రక్తపోటు కూడా ఈజీగా అదుపులో ఉంటుంది. ఈ పిస్తా పప్పులో యాంటీ ఆక్సిడెంట్ కెరోటినాయిడ్స్, పాలీ ఇంకా మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లుటిన్, ఆల్ఫా ఇంకా బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా పాటు ఫైటోన్యూట్రియెంట్స్ లుటిన్ ఇంకా జియాక్సంథిన్ మూలకాలు కూడా ఇందులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: