ఫుడ్ అలర్జీని తగ్గించే న్యాచురల్ టిప్స్?

frame ఫుడ్ అలర్జీని తగ్గించే న్యాచురల్ టిప్స్?

Purushottham Vinay
ఫుడ్ అలర్జీ అనేది సాధారణంగా ఆహారం తిన్న తర్వాత కొన్ని సెకన్లలో లేదా నిమిషాల్లో ఎక్కువ అవుతుంది.మనం చిన్నమొత్తంలో ఆహారం తీసుకున్నా కడుపు సమస్యలు, దద్దుర్లు, వాయుమార్గాల వాపు వంటి అలర్జీలకు ఇది కారణమవుతుంది. కొంతమంది వ్యక్తులు అనాఫిలాక్సిస్ అని పిలిచే ఆహార అలర్జీ వల్ల చాలా తీవ్రమైన లక్షణాలను అనుభవిస్తుంటారు.ఈ ఫుడ్ అలర్జీ వల్ల సాధారణంగా దురద, ఎరుపు దద్దుర్లు, ముఖం, నోరు గొంతు లేదా శరీరం లోని ఇతర ప్రాంతాల్లో వాపు, మింగడం కష్టంగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, కళ్లు తిరగడం, వికారంగా ఉండడం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, అతిసారం, గవత జ్వరం ఇంకా తుమ్ములు,కళ్లు దురద వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలర్జీ లక్షణాలు పరిశీలిస్తే నాలుక వాచిపోవడం, శ్వాస ఇబ్బంది, చాతీ బిగుసుకుపోవడం ఇంకా మింగడం లేదా మాట్లాడడంలో ఇబ్బంది తలతిరగడం, మూర్ఛపోయినట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


అయితే యాంటీ హిస్టామైన్లు మందులు దురద లేదా దద్దుర్లను తగ్గిస్తాయి. ఫుడ్ అలర్జీ తక్షణ లక్షణాలను ఆక్యుపంచర్ వైద్యం ఈజీగా తగ్గిస్తుంది.పాలు , పాల ఉత్పత్తుల వల్ల మూడేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లల్లో అలర్జీలు వస్తాయని తేలింది. కొన్నేళ్లు దాటిన తర్వాత ఇది క్రమంగా తగ్గిపోతుంది.  మొత్తం 16 సంవత్సరాల తర్వాత అలర్జీ తగ్గుతుంది.అయితే చాలా మందికి పల్లీలు కూడా పడవు. ఈ సోయా ఉత్పత్తులు వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. అలాగే గోధుమ లోని ప్రొటీన్లు అలర్జీకి కారణం కావచ్చు. ఉదరకుహర సమస్యలు ఉన్నవారు గోధుమలకు చాలా దూరంగా ఉండడం మంచిది. వంశ పారంపర్యంగా ఇంకా వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా అలర్జీలు రావచ్చు. నిమ్మరసంలో రోగ నిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది పుడ్ అలర్జీని ఈజీగా నివారిస్తుంది. గ్రీన్ టీ, క్యారట్ కరక్కాయ రసం, ఆముదం నూనె, విటమిన్ సి పదార్థాలు ఇంకా అలాగే వెనిగర్ వల్ల కూడా అలర్జీ తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: