బరువు తగ్గాలంటే ఈ చపాతీలు తినండి?

Purushottham Vinay
బరువు తగ్గాలంటే ఈ చపాతీలు తినండి?


ఇక సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి బదులుగా చపాతీ తింటూ వుంటారు. చపాతీ అనేది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే బరువు తగ్గేందుకు చపాతీ తినే వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గోధుమ పిండితో చేసిన చపాతీ తింటే ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్లు ఇంకా ఎక్కువ కేలరీలు ఉంటాయి.బియ్యం, గోధుమ పిండి లాగే క్వినోవా పిండిని కూడా ఇప్పుడు చాలా మంది తమ ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఎందుకంటే ఈ క్వినోవా పిండిలో పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. క్వినోవా పిండిలో ప్రొటీన్లు, ఫైబర్ ఇంకా ఐరన్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇది అనారోగ్య కేలరీలను వదిలించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ఇది మన బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.



ఇంకా అలాగే ఓట్స్ అనేవి బరువు తగ్గడానికి మీకు చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఇవి ఈజీగా అదుపులో ఉంచుతుంది. మనం ఉదయాన్నే ఓట్ మీల్ తినడం వల్ల మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మీ ఆహారంలో ఓట్స్‌ని చేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరచుకోవచ్చు.ఇంకా అలాగే బియ్యం, మైదా, గోధుమలతో పోలిస్తే మిల్లెట్ బయటి చర్మంలో పాలీఫెనాల్స్ అధిక సాంద్రతలో కనిపిస్తాయి. ఈ రాగుల్లోని ప్రొటీన్‌ కంటెంట్‌ను బియ్యంతో పోల్చిచూస్తే, రాగుల్లోని ప్రొటీన్ కంటెంట్ అనేది బియ్యం కంటే రెండింతలు ఉంటుంది. ఈ మిల్లెట్ పిండిలో ఫైబర్, అమైనో ఆమ్లాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా ఈజీగా జీర్ణమవుతుంది.ఇంకా ఈ రాగుల పిండిలో గ్లూటెన్ ఉండదు. ఊబకాయానికి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: