ఈ ఆహారాలను కలిపి తిన్నారంటే అంతే సంగతులు..!
పెరుగు,నెయ్యి కలిపి తింటే..
సాధారణంగా పెరుగును తీసుకోవడం వల్ల మన పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నెయ్యిని కంజుమ్ చేయడం వల్ల కూడా కొలస్ట్రాలను కరిగించి,డైజెస్టివ్ సిస్టం సక్రమంగా
పనిచేసేందుకు దోహదపడుతుంది.ఇవి రెండు విడివిడిగా తింటే ఆరోగ్యానికి మంచి చేస్తాయి కానీ,రెండు కలిపి తీసుకోవడం వల్ల,అధిక కొలెస్ట్రాల్ పెరిగి జీవనశక్తి తగ్గుముఖం పడుతుంది.దీనితో సోమరిగా,ఏ పని పైన ఉత్సాహం లేకుండా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దోసకాయ,టమాటా..
ఈ మధ్యకాలంలో సలాడ్ రూపంలో పండ్లు కూరగాయలను కలిపి తీసుకుంటున్నారు.కానీ టమాటా దోసకాయని మాత్రం అస్సలు కలిపి తినకూడదట.సాధారణంగా దోసకాయకి అసిడిక్ గుణాలు తగ్గించే గుణం ఉంటే,టమాటాలో ఆక్జాలిక్ యాసిడ్ ఉంటుంది.దీనితో పొట్ట డైజేషన్ చేసేందుకు కన్ఫ్యూజ్ అయ్యి,క్రమంగా గ్యాస్,మలబద్ధకం వంటి తలెత్తేందుకు దోహదపడుతుంది.కావున వీటిని కలిపి తినడం మానుకోండి.
చేపలు,పాలు..
కొన్ని రకాల హోటలు మరియు రెస్టారెంట్లో ఫిష్ చేపలు మరియు పాలన కలిపి వండుతూ ఉంటారు.కానీ ఈ రెండిటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల,ఈ పదార్థాలు వ్యతిరేకమైన ప్రోటీన్లు కలిగి ఉండడంతో సరిగా డైజేషన్ కాదు మరియు బ్లడ్ ఇన్ఫెక్షన్ కి గురిచేస్తుంది.దీనితో క్రమంగా వైట్ ప్యాచెస్,స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వేరుశెనగలు,నీరు...
సాధారణంగా వేరుశనక్కాయలు తినడం వెంటనే నీరు తాగాలని అనిపిస్తుంది.కానీ ఇలా అసలు చేయకూడదు.ఎందుకంటే వేరుశనక్కాయలలో ఆయిల్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల,నీటిలో ప్లోట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున వేరుశనగలు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆయిల్ కంటెంట్ ఇరుక్కుపోయి తోటి ఇన్ఫెక్షన్, దగ్గును కలుగచేస్తాయి.