గర్భవతులు ఈ గింజలు తినడం వల్ల అమృతంతో సమానం..!!

Divya
పెళ్లయిన ప్రతి స్త్రీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బిడ్డను కని,అమ్మ అని పిలిపించుకోవాలని తపన పడుతూ ఉంటారు.కానీ కొంతమంది కడుపుతో ఉన్నప్పుడు రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెడతారు కూడా..ఆ సమస్యలన్నిటికీ దూరం చేసే గుణం మన ప్రకృతిలో లభించే బార్లీ గింజలకే ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.పూర్వం రోజుల్లో దేవతలు తమ జీవిత కాలాన్ని పెంచుకునేందుకు అమృతం తాగినట్టు,ఇప్పుడు కడుపుతో ఉన్న స్త్రీలు వారి ఆరోగ్యాన్ని మరియు వారి బిడ్డ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి బార్లీ వాటర్ అంతే ప్రయోజనాలు కలిగిస్తుందని కూడా చెబుతున్నారు.మరి గర్భవతులకు ఈ వాటర్ ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం పదండి..
సుఖప్రసవం..
అవును ఈ మధ్యకాలంలో కడుపుతో ఉన్న ప్రతి పదిమంది స్త్రీలలో ఆరుగురు నార్మల్ డెలివరీ కాక,సిజరియన్ వెళ్తూ ఉన్నారు.దీనికి కారణం వారి శరీరంలో గర్భాశయం ముఖద్వారం సరైన మోతాదులో లేకపోవడమేనని డాక్టర్లు చెబుతూ ఉంటారు.కావున సుఖప్రవసవం కావాలి అనుకునే కడుపుతో ఉన్న ప్రతి స్త్రీ బార్లీ వాటర్ ని తాగడం చాలా మంచిది.ఇందులోని మెగ్నీషియం మరియు పోలిక్ యాసిడ్ పుష్కళంగా లభించడంతో,గర్భాశయం ముఖద్వారం రోజురోజుకీ పెరిగి,సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడతాయి.
బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి..
గర్భవతులుగా ఉన్నప్పుడు చాలామందికి అధికబీపీతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి,ఒక స్పూన్ బార్లీ పొడి కలిపి  మరిగించి,రోజు తాగుతూ ఉంటే,బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.
రక్తహీనత..
గర్భవతిగా ఉన్నప్పుడు అతిపెద్ద సమస్యగా మారేది రక్తహీనతే.. అటువంటి రక్తహీనతను తగ్గించుకోవడానికి బార్లీ వాటర్ లోని ఐరన్ కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.కావున గర్భవతులు రోజుకొక గ్లాస్ బార్లీ వాటర్ తీసుకోవడం చాలా ఉత్తమం..
మధుమేహం..
కొంతమందికి గర్భవతి కాకముందు మధుమేహం లేకున్నప్పటికీ,ఈ మధ్యకాలంలో గర్భం దాల్చిన సమయంలో వస్తూ ఉంది.అలా గర్భవతిగా ఉన్నప్పుడు మధుమేహం రాకుండా ఉండాలి అనుకున్న వారికి బార్లీవాటర్ చాలా బాగా సహాయపడుతుంది.ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ని పెరగకుండా కాపాడుతుంది.
జీర్ణశక్తి పెంచుకోవడానికి..
గర్భం దాల్చిన సమయంలో జీర్ణక్రియ కూడా మందగిస్తూ ఉంటుంది.అలాంటి వారికి రోజుకు ఒక గ్లాస్ బార్లీ వాటర్ ఇవ్వడం వల్ల,అందులోని అధిక పైబర్ వారి జీర్ణక్రియా రేటు పెంచుతుంది.దానితో వారు తిన్న ఆహారం సరిగా జీర్ణం అయి,అందులోని పోషకాలన్నీ పుట్టబోయే బిడ్డకు సక్రమంగా అందుతాయి కూడా .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: