ఇమ్యూనిటీని పెంచే జ్యూస్ లు ఇవే?

Purushottham Vinay
ఇమ్యూనిటీని పెంచే జ్యూస్ లు ఇవే?

సీజన్ ఏదైనా కూడా కొందరికి జలుబు, జ్వరం, ఇతర అంటు వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలోనే మెరుగైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలంటే కొన్ని రకాల పండ్ల రసాలను తాగితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.మరి ఏయే రసాలను తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.ఇమ్యూనిటీని పెంచే జ్యూస్ లు ... నారింజ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందు వలన ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.కాబట్టి మీ రెగ్యులర్ డైట్‌లో ఆరెంజ్ జ్యూస్ కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి.అలాగే దానిమ్మ పండులో శరీరానికి బాగా మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఈజీగా దూరమవుతంది. 


ఇంకా అలాగే ఇందులోని పోషకాల కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపడుతుంది.అలాగే పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే చెర్రీ పండ్లతో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఏ, విటమిన్ బీ ఇంకా పోటాషియం వంటివి ఉండడం వల్ల ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.అలాగే ఫాల్సా పండ్ల రసం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఫాల్సా లేదా ఇండియన్ బెర్రీగా ప్రసిద్ధి చెందిన ఈ పండ్లలో క్యాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం ఇంకా అలాగే పలు రకాల విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచే జ్యూస్ లు ఇవే..ఇవి మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి  ఫాల్సా జ్యూస్ ని కూడా మీరు తాగవచ్చు.కాబట్టి ఈ పండ్ల రసాలు తాగండి. రోగ నిరోధక శక్తిని ఈజీగా మెరుగుపరచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: