మహిళలకు గుడ్ న్యూస్.. లాలాజలం తో ప్రెగ్నెన్సీ టెస్ట్?

praveen
ప్రస్తుతం వైద్యరంగంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ కారణంగా ఇక ప్రతి చిన్న విషయానికి ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంటి దగ్గర నుంచి ఇక తమకు వచ్చిన సమస్య ఏంటి అన్న విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు ఎంతోమంది. అదే సమయంలో ఇక కొంతమంది అయితే ఈ టెక్నాలజీని వినియోగించుకొని సొంతంగా చికిత్స చేసుకోవడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాము. ఇలా వైద్యరంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు తెరమీదకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి వినూత్నమైన ఆవిష్కరణ గురించే. సాధారణంగా మొన్నటి వరకు మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం కోసం మూత్ర పరీక్ష ద్వారా తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు ఇక ఇలా ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవడం మరింత సులభంగా మారిపోయింది అనిచెప్పాలి. మూత్రంతో కాదు ఏకంగా లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. బెరుసలెం కు చెందిన సాలిగ్నోస్టిక్స్ అనే బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇలా లాలాజలం ద్వారా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి తెలుసుకునే ఒక సాలిస్టిక్ కిట్ ను ఆవిష్కరించింది.

 తద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎంతో సులభంగా ప్రెగ్నెన్సీ గురించిన విషయాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందట. అయితే ఈ సాలిస్టిక్ కిట్ లో వచ్చే స్టిక్ నోట్లో పెట్టుకుంటే సరిపోతుంది. కేవలం అయితే ఐదు నిమిషాలలో ఫలితం ఖచ్చితంగా తెలుస్తుందని చెబుతున్నారు వైద్యులు.. ఇక ఇటీవల ఇక ఈ సాలిస్టిక్ స్టిక్ ను అటు యూకే లో లాంచ్ చేశారు అని చెప్పాలి. ఇక మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ వినూత్నమైన ఆవిష్కరణను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాలిగ్నోస్టిక్స్ స్టార్ టప్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కిట్ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మరింత సులభతరం కానుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: