
జామ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
జామపండులో ఆరెంజ్ లో కంటే ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది.ఈ పండును తరుచూ తీసుకోవడం వల్ల,రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా లభిస్తుంది.మరియు జామకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.కావున జామ పండును మధుమేహ రోగులకు గొప్ప వరంగా చెప్పవచ్చు.
అంతేకాక ఇందులో అధికంగా వున్న సోడియం మరియు మెగ్నీషియం గుండె కండరాలను దృఢపరిచి,గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా కాపాడుతాయి.ఇందులో ఉన్న అధిక పొటాషియం బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే అరటిపండు,జామపండులో దాదాపు ఒకే మొతాదులో పొటాషియం కంటెంట్ లభిస్తుంది.
జామకాయ గర్భిణీ స్త్రీలు తింటే వాతం కలుగుతుందని చెబుతుంటారు.కానీ వీరు మొతాదులో జామ పండును తీసుకుంటే చాలా మంచిది.ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్,విటమిన్ బి9 పుట్టబోయే బిడ్డ మెదడునాడీ వ్యవస్థ ఎదుగుదలకు తోడ్పుతుంది.అలాగే ఎటువంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్ దరి చేరకుండా సహాయపడుతుంది.కానీ రోజుకో పండు మాత్రమే తినడం ఉత్తమం.
జామ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోనే ఆంటీ ఆక్సిడెంట్ లు సీజనల్గా వచ్చే దగ్గు,జలుబు మరియు జ్వరం వంటి రోగాలు రాకుండా కాపాడుతాయి.అంతేకాక ఇందులో ఉండే లైకోపీయన్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ను కలిగించే ప్రీరాడికల్స్ తో పోరాడి,క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల,జీర్ణశక్తి మెరుగుపడి,అజీర్తి,మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తొలుగుతాయి.