బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే భయంకర జబ్బులు మాయం?

Purushottham Vinay
బిర్యానీ ఆకు వల్ల వంటల రుచి బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. దీన్ని కేవలం వంటల్లోనే కాకుండా  ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. బిర్యానీ ఆకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకులను అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకులో యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకును ఉపయోగించడం వల్ల దంత సమస్యలను, శ్వాస సంబంధిత సమస్యలను, మూత్రపిండాల సమస్యలను, అధిక బరువును, షుగర్ వ్యాధిని ఇంకా అలాగే గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.ఇంకా అంతేకాకుండా బిర్యానీ ఆకును ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్యను కూడా చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఇక ఈ ఆకులను పొడి రూపంలో తీసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసుకుని తాగవచ్చు.అయితే దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ ఆకులను రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను వేసి వాటిని వేడి చేయాలి.


ఈ నీటిని మధ్యస్థ మంటపై ఒక 4 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత దీనిపై మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని కొద్ది కొద్దిగా తాగాలి.ఇక ఇలా తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. అజీర్తి, మలబద్దకం ఇంకా గ్యాస్ వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. బిర్యానీ ఆకులో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నొప్పులను, వాపులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా అలాగే షుగర్ తో బాధపడే వారు ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి.అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. మెదడు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే మతిమరుపు సమస్య కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: