మంగు మచ్చలకు చింత గింజలతో చెక్ పెట్టండి..!
చింత గింజల ఉపయోగాలు..
సాధరణంగా మన చర్మం కింద పొరల్లో మెలనోసైట్స్ మెలనిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్ మన జుట్టు నల్లగా ఉండడానికి, మరియు మనిషి చర్మం యొక్క రంగు నిర్దేశించబడటానికి ఉపయోగపడుతుంది. దీనికి కారణం చర్మం కింద థైరోసిన్ అనే ఎంజైము ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల మంగుమచ్చలు వస్తాయి. ఇలాంటి మంగు మచ్చలు పోగొట్టుకోవడానికి,చింత గింజలను రెండు చుక్కలు నీటి వేసి బాగా సాది, వచ్చిన మిశ్రమాన్ని ఆ మచ్చలపై రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల,మెలనిన్ కారణమైన థైరోసిన్ ఎంజాయ్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేయడంలో సహాయపడతాయి. అంతేకాక టేబుల్ స్పూన్ చింత గింజల పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల, మెలనిన్ ఉత్పత్తి తగ్గి,మంగు మచ్చలు తగ్గ ముఖం పడతాయి.అంతే కాక చింత గింజల పొడిని తేనెలో వేసి సాది మంగు మచ్చలపై అప్లై చేయడం వల్ల కూడా వాటికి ఉపశమనం కలుగుతుంది.
జాగ్రత్తలు..
ఈ మంగు మచ్చలతో బాధపడేవారు, వారి చర్మాన్ని ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.ఎండ ఎక్కువగా చర్మంపై పడినా కూడా మంగు మచ్చలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అంతేకాక విటమిన్ ఏ మరియు ఈ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల థైరోసిన్ ఉత్పత్తి తక్కువ ముఖం పడుతుంది.