హెల్త్ : వీటిని మాత్రం పచ్చిగా తినకండి..?

Purushottham Vinay
Healthy tips for good health and long life

హెల్త్ : వీటిని మాత్రం పచ్చిగా తినకండి..?

కొన్ని కూరగాయలు ఇంకా పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవటం చాలా మందికి కూడా అలవాటు. అయితే  మన ఆరోగ్యాన్ని ప్రేరేపించే బ్యాక్టీరియాను చంపడానికి కొన్ని పచ్చి కూరగాయాలను మాత్రం ఉడికించాలి. పచ్చిగా తినకూడదు. పచ్చిగా తినకూడని ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.ఇక అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.బంగాళ దుంపలను కేవలం ఉడికించి మాత్రమే తినాలి. ఎందుకంటే వాటిని పచ్చిగా తినలేరు. ఒక ప్రధాన కారణం ఏమిటంటే ఇది భూగర్భంలో పెరుగుతుంది. ఇది విషపూరిత పదార్థాలకు గురికావడం అనేది ఇతర కూరగాయల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది జీర్ణం కావడం కష్టంగా ఉండే అధిక పిండి పదార్ధాలను కూడా కలిగి ఉంటుంది.దీనిని వండటం వల్ల పిండిని విచ్ఛిన్నం చేస్తుంది. అందువల్ల కడుపు జీర్ణం కావడానికి కొద్దిగా సులభతరంగా ఉంటుంది.


ఇంకా అలాగే ఆకుపచ్చ ఆకు కూరలు శరీరానికి చాలా హాని కలిగించే దోషాలు ఇంకా బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. వీటిని సలాడ్‌లలో పచ్చిగా తినడం కంటే ఉడకబెట్టి ,వేయించి తీసుకోవటం మంచిది. ఈ బచ్చలి కూరను పచ్చిగా తీసుకోవటం ఏమాత్రం సరైంది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం బచ్చలికూర యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను పెంచుతుందని ఇంకా దానిని తీసుకోవడం ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు.ఇక అందరికి అందుబాటులో ఉన్న ఉత్తమ పండ్లలో టమాటో కూడా ఒకటి. శాండ్‌విచ్ లేదా సలాడ్‌పై అవి చాలా రుచికరంగా ఉంటాయి. అయితే, వండిన టొమాటోలలో ఉండే లైకోపీన్ దాని పచ్చి రూపంతో పోలిస్తే శరీరం చాలా సులభంగా గ్రహించగలదని ఆరోగ్య నిపుణులు నిపుణులు చెబుతున్నారు. ఇక లైకోపీన్ ఒక ఫైటో-న్యూట్రియంట్.ఇది చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: