మెడపై నలుపుతో బాధపడుతున్నారా..అయితే చిట్కా మీకోసమే..?

Divya
మన శరీరంలో ప్రతిభాగము అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ కొంతమందికి ముఖంపై మచ్చలు, మొటిమలు, ఒక విధంగా అందాన్ని దెబ్బతీస్తే,మరి కొంతమందిలో మెడపై నలుపుదనం వల్ల అందం దెబ్బతింటుంది. దీనితో చాలామంది నలుగురిలో కలవాలన్న ఇబ్బందిపడుతుంటారు.సాధారణంగా మెడభాగం టాన్ వల్ల లేదా,మేడలో వేసుకొనే ఆర్నమెంట్స్ పడకపోవటం వల్ల కానీ మరియు శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ,మెడ నల్లగా మారుతుంటుంది.దీనిని పోగొట్టుకోవడానికి రకరకాల బ్యూటీప్రొడక్ట్స్ వాడినా, బ్యూటీపార్లల్ చుట్టూ తిరిగి వదిలించుకోవాలి అనుకున్న ప్రయోజనము లేక విసిగిపోతుంటారు.ఇలాంటి వారికోసం ఇంట్లో సహజంగా దొరికే పదార్థాలను ఉపయోగించి సింపుల్ చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.ఆ పదార్థాలేంటో, అవి ఏవిదంగా వాడాలో ఇప్పుడు చూద్దాం..
నిమ్మకాయ..
అవును నిమ్మకాయ రుచికే కాక అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇలాంటి చిట్కాలు ఉపయోగించి మన పూర్వికులు ఎలాంటి బ్యూటిపార్లల్ కి వెళ్లకుండానే,తక్కువ ఖర్చుతోనే అత్యంత అందంగా ఉండేవారు.నిమ్మకాయ చర్మాన్ని అందంగా తయారుచేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా ఇందులో లభించే విటమిన్ సి,బి, భాస్వరం, సిట్రిక్ యాసిడ్,కార్బోహైడ్రేట్ నలుపుధనాన్ని తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి.
 నిమ్మకాయతో సింపుల్ చిట్కాలు
1. మొదటి చిట్కా :దీనికోసం నిమ్మకాయ, మరియు దోసకాయ, శనగపిండి తీసుకోవాలి.దోసకాయ చల్లధనాన్ని ఇవ్వడమే కాక చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మరియు నిమ్మకాయలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు,మెడపై నలుపుదనం పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఒక నిమ్మకాయ తీసుకొని రసం తీసి,అందులో రెండు టేబుల్ స్ఫూన్ లా దోసకాయ గుజ్జు, ఒక స్ఫూన్ శనగపిండి కలిపి మేడపై పట్టులా వేయాలి. ఇది బాగా ఆరిన తర్వాత సున్నితంగా మర్దన చేస్తూ, శుభ్రం చేయాలి.ఇది మేడపై ట్యాన్ ని తొందరగా, తొలగిస్తుంది.
2. రెండవ చిట్కా : బంగాళాదుంప కూడా చర్మాన్ని అందంగా తయారుచేస్తుంది.దీని కోసం ఒకస్ఫూన్ నిమ్మరసం, ఒకస్ఫూన్ బంగాళాదుంప గుజ్జు కలిపి మేడపై రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మెడను కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడంతో,మెడపై నలుపుదనాన్ని ఈజీగా తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: