ఇక నిద్రపోయే ముందు ఎక్కువ తినడం వల్ల నిద్రపోవడం చాలా కష్టంగా మారుతుంది. అధిక కేలరీల ఆహారాన్ని పెద్ద మొత్తంలో తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా ఆలస్యం అవుతుంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు ఎప్పుడూ కూడా ఆకలి కంటే కొంచెం తక్కువగా తినడం మంచిది. చాలా మంది ఈ అలవాటును చాలా తేలికగా తీసుకుంటారు. కానీ దాని ప్రభావం అనేది క్రమంగా పెద్ద అలవాటుగా మారుతుంది.ఈ అలవాటును కనుక మార్చుకోకపోతే అది శరీరానికి చాలా తీవ్రమైన సమస్యను సృష్టిస్తుంది.అలాగే టీ- కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మెదడును చాలా కాలం పాటు చురుకుగా ఉంచుతుంది.అలాంటి పరిస్థితిలో, నిద్రవేళకు ముందు కెఫిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రాత్రంతా కూడా మేల్కొని ఉంటారు. కెఫీన్ అనేది మీ శరీర సహజ నిద్ర-మేల్కొనే పద్దతికి అంతరాయం కలిగిస్తుందని,ఇంకా ఇది తగినంత నిద్రకు దారితీస్తుందని కూడా ఒక అధ్యయనం తెలిపింది. నిద్రపోయే ముందు టీ-కాఫీ తాగే అలవాటు కనుక మీకు కూడా ఉంటే, ఖచ్చితంగా ఈ అలవాటును మార్చుకోండి. ఈ అలవాటు వల్ల చాలా నష్టపోతారు.
మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఈ అలవాటును మానుకోండి.అలాగే అవసరమైన దానికంటే ఎక్కువ గంటలు లేదా మీ సామర్థ్యానికి మించి పని చేయడం మీ ఆరోగ్యానికి ఖచ్చితంగా హానికరం. వారానికి 55 గంటలకు పైగా పని చేయడం వల్ల గుండె జబ్బులు, గుండెపోటు ఇంకా మరణాల ముప్పు పెరుగుతుందని కొత్త అధ్యయనం కనుగొంది.ఇక అటువంటి పరిస్థితిలో, రాత్రి భోజనం తర్వాత ఆఫీసు పనిని మీరు అస్సలు చేయవద్దు. విశ్రాంతి కోసం ఖచ్చితంగా ప్రత్యేక సమయం ఇవ్వండి.మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. కానీ మీరు దీన్ని ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యకూడదు. ఎందుకంటే అది మీ ఆరోగ్యంపై కూడా ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.అందుకే రాత్రిపూట ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల, శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అనేవి ఏర్పడతాయి. అలాగే, రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. దీని వల్ల నిద్ర కూడా చెదిరిపోతుంది.