చలికాలంలో వచ్చే డస్ట్ అలర్జీని ఇ చిట్కాలతో తగ్గించుకోవచ్చని తెలుసా..!

Divya
చాలా మంది డస్ట్ అలర్జీతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.గాలిలోని కొంచెం ఉన్న దుమ్ము, ధూళీ కణాల వున్నా సరే అవి ముక్కులోకి వెళ్ళినప్పుడు వరుసగా తుమ్ములు రావడం,ముక్కు కారడం, కళ్లనుండి నీరు కారడం,గొంతులో దురదగా అనిపించడం, దగ్గు, తలనొప్పి,నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు అధికంగా బాధిస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో ఇంగ్లిష్ మందులు వాడినా ఫలితం అంతగా ఉండక ఇబ్బంది పడుతుంటారు.
అసలు ఈ డస్ట్ అలర్జీ సాధారణంగా గాలిలో ఉండే సూక్ష్మ జీవులు, పుప్పొడి కణాలు, జంతువుల వెంట్రుకలు, చుండ్రు, ఫంగస్,బ్యాక్టీరియా వంటి మైక్రోబ్స్ అలర్జీకి కారణమవుతుంటాయి. ఈ డస్ట్ అలర్జీని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

ఆపిల్ వెనిగర్..
డస్ట్ అలర్జీని నివారించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా సహాయపడుతుంది.ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో మూడు స్ఫూన్ ల ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు స్ఫూన్ ల తేనే వేసి బాగా కలిపి,రోజూ పరగడుపున తాగడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్ సైడర్ వెనిగర్‏లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు అలర్జీని నివారిస్తాయి.
యాకలిప్టస్ ఆయిల్..
అలర్జీని తగ్గించుకునేందుకు 3లేదా4 చుక్కలు యాకలిప్టస్ ఆయిల్ తీసుకొని,బాగా మరిగే నీటిలో వేసి ఆవిరి పట్టుకోవాలి. ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అలెర్జీని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
పసుపు..
పసుపులో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కళంగా ఉంటాయి.అలర్జీని తగ్గించడం కోసం  ఒక కప్పు వేడి పాలలో అర టి స్ఫూన్ పసుపు,చిటికెడు నల్ల మిరియాలు, కొన్ని చుక్కల తేనె వేసి బాగా కలిపి రోజూ తీసుకోవాలి.పసుపు మరియు తేనేలోగల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అలర్జీని తగ్గిస్తాయి.
కలబంద రసం..
కలబందను తీసుకొని శుభ్రం చేసి మిక్సీ పట్టాలి. అందులో తేనే, నిమ్మరసం కలిపి తాగాలి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల అలెర్జీలను సులభంగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: