ఈ గింజలతో అనేక రకాల సమస్యలు మాయం?

Purushottham Vinay
బరువును చాలా ఈజీగా తగ్గించడంలో చియా విత్తనాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విత్తనాలు చూడడానికి చిన్నగా నల్లగా ఉంటాయి. చాలా మంది కూడా చియా విత్తనాలు ఇంకా సబ్జా గింజలు ఒక్కటే అని అనుకుంటారు. కానీ ఈ చియా విత్తనాలు వేరు ఇంకా సబ్జా గింజలు వేరు. చియా విత్తనాలు అనేవి నీటిలో ఎలా వేస్తే అలాగే ఉంటాయి. ఇక సబ్జా గింజలు మాత్రం నీటిలో వేస్తే అవి తెల్లగా మారుతాయి. ఇంకా ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ చియా విత్తనాలను వేసి ఒక అర గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని తాగుతూ  విత్తనాలను కూడా తినాలి. వీటిని నేరుగా తినలేని వారు విత్తనాలను సలాడ్ లలో ఇంకా జ్యూస్ లలో వేసుకుని తీసుకోవచ్చు. ఈ చియా విత్తనాలను రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట పరగడుపున తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు.ఇక వీటిని తీసుకునే ముందు ఈ నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలోని మలినాలు ఇంకా అలాగే విష పదార్థాలు కూడా ఈజీగా తొలగిపోతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను వాడకపోవడమే మంచిది.



అధిక బరువు ఇంకా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారికి ఈ చియా విత్తనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన అనేది వారికి కలుగుతుంది. ఇంకా అలాగే వారికి ఆకలి కూడా త్వరగా వేయదు. ఈ కారణం వల్ల మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. దీంతో మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.వీటిని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. చియా విత్తనాల్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్తి, మలబద్దకం ఇంకా అలాగే గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాకుండా తలనొప్పితో బాధపడుతున్నప్పుడు నానబెట్టిన చియా విత్తనాలను తీసుకోవడం వల్ల తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది. మైగ్రేన్ వంటి సమస్యతో బాధపడే వారు కూడా ఈ టిప్ పాటించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. చియా విత్తనాలను ఈ విధంగా తీసుకోవడం వల్ల రక్తం కూడా బాగా శుద్ధి అవుతుంది. అలాగే రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. ఇంకా బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: