ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..అయితే లివర్ దెబ్బతిన్నట్టే..?

Divya
ఈ మధ్య కాలంలో షుగర్, బిపి, కాలేయ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రోజూ రోజుకు అధికమవుతున్నారు. వాటికీ కారణం ఆధునిక జీవన విధానం,సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వంటి వల్ల వీటి బారిన పడుతున్నారు. కాలేయం అనేది మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.దీని పనితీరు దెబ్బతినడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురి అవుతారు.ఈ రోజుల్లో ప్రజలు ఫ్యాటీ లివర్ మాత్రమే కాదు లివర్‌ ఫెయిల్యూర్‌ సమస్యని కూడా అధికంగా ఎదురుకుంటున్నారు.మధుమేహంతో బాధపడేవారికి లివర్‌ దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ సమస్య అధికంగా 18 ఏళ్లలోపు బాలల్లో కనిపిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది.అవేంటో ఇప్పుడు చూద్దాం..
లివర్‌ ఫెయిల్యూర్‌ అంటే.. రోగి శరీరంలో కాలేయ కణాలు నిదానంగా చనిపోవడం జరుగుతుంది.ఒక్కొక్క సమయంలో కాలేయం పనితీరు దెబ్బతిని, దాని పని నిర్వహించడం మానేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధి మొదటిసారి వచ్చి నప్పుడే అలాంటి సమయంలో బాధితుడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నిర్లక్ష్యం చేస్తే వెంటనే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.
ఇలాంటి లక్షణాలు ఉంటే లివర్ దెబ్బ తిన్నట్టే..
కళ్ళు పసుపుపచ్చ రంగులోకి మారడం, పొట్ట ఉబ్బరం, రక్తంతో కూడిన వాంతులు, వికారం, నిస్సత్తువా బలహీనత, శ్వాస ఆడకపోవడం, ఉదర సమస్యలు, కిడ్నీ పనితీరు దెబ్బతినడం వల్ల,మలినాలు శరీరంలో పేరుకుపోవడం వాటి సమస్యలు చుట్టూ ముడుతాయి.
చికిత్స..
 ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా వైద్యచికిత్స అందించాలి. కొంచెం ఆలస్యమైనా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటించడం చాలామంచిది. చికిత్సతోపాటు లైక్విడ్ మరియు సులభంగా జీర్ణం అయ్యో ఆహారాలు ఎక్కువగా ఇస్తుండాలి. దీనివల్ల డీహైడ్రెట్ కాకుండా వుంటారు.తక్షణ శక్తి వచ్చి, సమస్య తగ్గుముఖం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: