రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన డ్రింక్?

Purushottham Vinay
రోగ నిరోధక శక్తి అనేది మనిషికి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈ డ్రింక్ చేసుకొని తాగండి. దీనికి ముందుగా మనం ఒక జార్ లో 4 మిరియాలను వేయాలి. అలాగే ఇందులో పావు టీ స్పూన్ జీలకర్రను ఇంకా అలాగే పావు టీ స్పూన్ సోంపును కూడా వేయాలి. తరువాత వీటిని బాగా మెత్తని పొడిగా చేసుకోవాలి.ఆ తరువాత రెండు ఇంచుల అల్లం ముక్కను తీసుకుని దానిని శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక చిన్న పచ్చి పసుపు కొమ్మును తీసుకుని దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేయాలి. తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వాటిని వేడి చేయాలి. ఇందులో అల్లం ముక్కలు, పసుపు ముక్కలు ఇంకా అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసి ఒక గ్లాస్ నీళ్లు ముప్పావు గ్లాస్ అయ్యే వరకు కూడా బాగా మరిగించాలి.ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కొరకు దీనిలో ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసి కలుపుకోవచ్చు.


ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు.ఇంకా అలాగే సంవత్సరం దాటిన పిల్లల నుండి వృద్ధుల వరకు దీనిని తీసుకోవచ్చు. ఈ డ్రింక్ ఎక్కువగా తీసుకుంటే ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ డ్రింక్ తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నింటిలో కూడా యాంటీ వైరల్ ఇంకా అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సహజంగానే ఉంటాయి.ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ డ్రింక్  తాగడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.ఇంకా అంతే కాకుండా శరీరంలోని మలినాలు అన్నీ కూడా ఈజీగా తొలగిపోయి శరీరం లోపల బాగా శుభ్రపడుతుంది. రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండి తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడేవారు ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ డ్రింక్ తాగడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధశ శక్తి పెరుగుతుంది. ఎలాంటి రోగాలు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: