ఇది తిన్నారంటే అసలు ఏ జబ్బులు రావు?

frame ఇది తిన్నారంటే అసలు ఏ జబ్బులు రావు?

Purushottham Vinay
పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు కలుగుతుంది. పల్లీల్లో ఉండే విటమిన్స్ మనం ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.ఈ పల్లీలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా అలాగే శరీరంలో మెటబాలిజాన్ని పెంచడంలో కూడా పల్లీలు ఉపయోగపడతాయి. పల్లీల్లో పుష్కలంగా ఉండే క్యాల్షియం ఎముకలను బాగా ధృడంగా ఉంచడంలో ఇంకా అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా బాగా తోడ్పడుతుంది.అయితే వీటిని ఉడికించి తీసుకుంటే చాలా మంచిది. అలా వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు కలుగుతుంది. ఇంకా అలాగే మార్కెట్ లో దొరికే పచ్చి పల్లీలను నీటిలో రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. వీటిని మొలకెత్తించి తీసుకున్నా కూడా మనం ఎన్నో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. గుడ్లు, మాంసంలో కంటే పల్లీల్లో 50 శాతం ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.


ఈ నానబెట్టిన పల్లీలతో పాటు బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. షుగర్ వ్యాధితో బాధపడే వారు మాత్రం కేవలం పల్లీలనే ఆహారంగా తీసుకోవాలి. ఈ పల్లీలను, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పల్లీలను ఇంకా బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాస కోస సంబంధిత సమస్యల నుండి, ఇన్ఫెక్షన్ ల నుండి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. దగ్గు, జలుబులతో బాధపడే వారు వీటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు కూడా పల్లీలను ఇంకా బెల్లాన్ని కలిపి ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: